Health Tips: వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎందుకంత ఆరోగ్యకరం.. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం

ఆహారపు అలవాట్లు ఎంత బాగుంటే ఆరోగ్యం అంత బాగుంటుందని మనందరికీ తెలిసిందే. చాలా వరకు మన భోజనంలో మధ్యాహ్నం, రాత్రి సమయంలో ఎక్కువ భాగం రైస్ కే ఉంటుంది.

Health Tips: వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎందుకంత ఆరోగ్యకరం.. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం
Brown Rice
Follow us

|

Updated on: Sep 08, 2022 | 9:37 PM

Health Tips: కరోనా (Corona) తర్వాత ఆహారంపై, ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ.. ప్రయోజనాలు కలిగించే ఆహారంపై అవగాహన పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు ఎంత బాగుంటే ఆరోగ్యం అంత బాగుంటుందని మనందరికీ తెలిసిందే. చాలా వరకు మన భోజనంలో మధ్యాహ్నం, రాత్రి సమయంలో ఎక్కువ భాగం రైస్ కే ఉంటుంది. అయితే రోజూ తినే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యపరంగా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో చాలామంది సగటున వైట్ రైస్ (White Rice) తింటుంటారు. కానీ వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్ ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే ప్రస్తుతం బ్రౌన్ రైస్ వినియోగం అధికమైంది. ధాన్యం పొట్టును తొలగించిన తర్వాత ఉండే బియ్యమే ఇది. రంగు కాస్త బ్రౌన్ కలర్‌లో ఉండటం వల్ల బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. దీనిని పూర్తిగా పాలిష్ చేస్తే వైట్ రైస్ తయారవుతుంది. ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

ప్రాసెస్ చేయని బియ్యం కాబట్టే ఇందులో న్యూట్రియంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా లాభాలు కలిగిస్తాయి. బ్రౌన్ రైస్ లోని ఫైబర్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి. ఇందులో ఉండే లిగ్నాన్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.

ఇవి కూడా చదవండి

బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. ఎందుకంటే ఇది రిఫైండ్ రైస్ కాదు. అదే వైట్ రైస్ లేదా ప్రోసెస్డ్ బియ్యంలో న్యూట్రియంట్లు, ఫైబర్ చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరానికి పోషక పదార్ధాలు తక్కువగా లభిస్తాయి. అదే బ్రౌన్ రైస్ ఉపయోగించడం వల్ల ఫైబర్, న్యూట్రియంట్లు బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి