ప్రసవానికి ఆరు గంటల ముందు, తర్వాత.. అంబులెన్స్‌లో పరీక్షలు రాసిన మహిళ.. అక్కకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
కూతురు పుట్టడానికి ఆరు గంటల ముందు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు లక్ష్మి పరీక్ష రాసింది. రాత్రంతా హాస్పిటల్‌లో చదువుకున్న తర్వాత డెలివరీ అయిన 15 గంటల తర్వాత ఆమె మరో పరీక్ష చేసింది.
ప్రసవానికి ఆరు గంటల ముందు ఒక మహిళ అంబులెన్స్‌లో పరీక్ష రాసింది. అనంతరం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మర్నాడు పరీక్ష కూడా రాసింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని జిరి గ్రామానికి చెందిన లక్ష్మీ కుమారి B.Ed చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం 3:00 గంటల ప్రాంతంలో సూరత్‌గఢ్ సిహెచ్‌సిలో లక్ష్మి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కూతురు పుట్టడానికి ఆరు గంటల ముందు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు లక్ష్మి పరీక్ష రాసింది. రాత్రంతా హాస్పిటల్‌లో చదువుకున్న తర్వాత డెలివరీ అయిన 15 గంటల తర్వాత ఆమె మరో పరీక్ష చేసింది. ఆమె భర్త శ్యామ్‌లాల్ మీనా దీని కోసం పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ రవిశర్మతో మాట్లాడి అనుమతి పొందారు.
కాగా, లక్ష్మీతోపాటు మరో ఇద్దరు సూపర్ మామ్‌లు సోను శర్మ, సరిత కూడా ఈ కేంద్రంలో పరీక్షలు రాశారు. నాలుగు రోజుల కిందట సోను ఒక శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం పరీక్ష రాసిన ఆమెకు కేంద్రంలో ఒక బెడ్ ఏర్పాటు చేశారు. మూడు రోజుల క్రితం సరిత కూడా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె కూడా కారులో కూర్చొని పరీక్ష రాసింది.
అయితే ప్రసవ బాధలు భరిస్తూ జీవితంలో ముఖ్యమైన సమయంలో కూడా పరీక్షలకు హాజరైన ఈ మహిళలను పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ రవిశర్మ అభినందించారు. పరీక్షల పట్ల అంకిత భావానికి వారు నమస్కరిస్తున్నానని అన్నారు.