PM Kisan Yojana: పీఎం కిసాన్‌ స్కీమ్‌లో గోల్‌మాల్‌.. 21 లక్షల మంది అనర్హులుగా గుర్తింపు

PM Kisan Yojana: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ గురించి అందరికి తెలిసిందే. దీని వల్ల ఎంతో మంది రైతులు లాభం పొందుతున్నారు. ఈ పథకానికి ప్రధాని..

PM Kisan Yojana: పీఎం కిసాన్‌ స్కీమ్‌లో గోల్‌మాల్‌.. 21 లక్షల మంది అనర్హులుగా గుర్తింపు
Pm Kisan Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Sep 08, 2022 | 8:11 AM

PM Kisan Yojana: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ గురించి అందరికి తెలిసిందే. దీని వల్ల ఎంతో మంది రైతులు లాభం పొందుతున్నారు. ఈ పథకానికి ప్రధాని నరేంద్ర మోడీ యూపీలో 24 ఫిబ్రవరి 2019న పీఎం కిసాన్‌ స్కీమ్‌ను ప్రారంభించారు. అయితే ఈ పీఎం కిసాన్‌ స్కీమ్‌ వచ్చాక కొన్ని రాష్ట్రాల్లో అనర్హులు కూడా డబ్బులు పొందుతుండగా, కేంద్రం నిఘా పెట్టింది. దీంతో అనర్హులను ఏరివేసే కార్యక్రమం చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ పథకంలో రాష్ట్రంలో 21 లక్షల మంది అనర్హులుగా గుర్తించింది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం. ఇప్పటికే అక్కడ ఎంతో మంది అనర్హులుగా గుర్తించగా, ఇంకా ఏరివేత కార్యక్రమం చేపడుతూనే ఉంది.

ఈ పథకం ద్వారా పొందిన సొమ్మును తిరిగి రాబట్టే పనిలో ఉన్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్‌ షాహి వెల్లడించారు. యూపీలో 2.85 కోట్ల మంది రైతులు ఉండగా, అందులో 21 లక్షల మంది అనర్హులగా తేల్చింది ప్రభుత్వం. ఒకే ఇంట్లో భార్యాభర్తలిద్దరు, ఆదాయపు పన్ను కట్టేవారు ఈ పీఎం కిసాన్‌ స్కీమ్‌ ద్వారా డబ్బులు అందుకున్న వారిలో ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు వారు పొందిన మొత్తాన్ని రికవరీ చేస్తామని ఆయన వెల్లడించారు.

కాగా, రైతులకు పెట్టుబడి సాయంగా ఉండేందుకు ఈ పీఎం కిసాన్‌ స్కీమ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున అందిస్తోంది కేంద్రం. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతల్లో అంటే రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. అనర్హులు పొందిన ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ప్రత్యేక సదుపాయాన్ని సైతం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?