Bank Monthly Balance: బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో నెలవారీ బ్యాలెన్స్ ఎంత ఉండాలి..? లేకపోతే తీవ్ర నష్టమే..!
Bank Monthly Balance: బ్యాంకు ఖాతారులు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పొదుపు ఖాతాలు తీసుకున్నవారు నెలవారీ కనీస నిల్వను ఉంచడం తప్పనిసరి. రిజర్వ్ బ్యాంక్..
Bank Monthly Balance: బ్యాంకు ఖాతారులు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పొదుపు ఖాతాలు తీసుకున్నవారు నెలవారీ కనీస నిల్వను ఉంచడం తప్పనిసరి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతే పెనాల్టీలు విధించాలని గతంలోనే బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు పొదుపు ఖాతాలున్నవారు జీరో బ్యాలెన్స్ ఉంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇక ఏయే బ్యాంకుల్లో ఎంత నిల్వ ఉండాలో చూద్దాం.
ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వ ఎంతుండాలి..?: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకులో ఖాతాదారుడు కనీస నిల్వ మొత్తాన్ని మెయింటెన్ చేయాలి. లేకపోతే పెనాల్టీ భరించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ఖాతాదారుడు సగటున బ్యాంకు ఖాతాలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.1000, సెమి-అర్బన్ ప్రాంతాల్లో రూ.2000, మెట్రోసిటీలో రూ.3000 ఉండాలి.
హెచ్‌డీఎఫ్‌సీలో కనీస నిల్వ..: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కనీస నిల్వ ఉండాల్సిందే. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.10,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 ఉండాలి.
ఐసీఐసీఐ బ్యాంకులో..: ఇక ఐసీఐసీఐ సేవింగ్స్ అకౌంట్‌లో మెట్రో నగరాల్లో రూ.10,000, సెమీ అర్బన్ నగరాల్లో రూ.5000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 ఉండాల్సి ఉంటుంది.
యాక్సిన్ బ్యాంకులో..: యాక్సిస్ బ్యాంకులో మెట్రో నగరాల్లో రూ.12,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 ఉండాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి