HDFC: బాదుడే బాదుడు.. కస్టమర్లకు షాకిచ్చిన HDFC.. ఎవరిపై ప్రభావం అంటే..
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం HDFC తమ బ్యాంకులో రుణాలు తీసుకున్న కస్టమర్లకు షాకిచ్చింది. హెచ్ డీఎఫ్ సీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో రుణగ్రహీతకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్..
HDFC: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం HDFC తమ బ్యాంకులో రుణాలు తీసుకున్న కస్టమర్లకు షాకిచ్చింది. హెచ్ డీఎఫ్ సీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో రుణగ్రహీతకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ -MCLRని 10 బేసిస్ పాయింట్లకు పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. MCLR రేటు పెంపుతో గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర రుణాల కోసం సమానమైన నెలవారీ వాయిదాలపై ప్రభావం పడుతుంది. ఈ పెంపుతో HDFC బ్యాంక్ MCLR 8.2 శాతానికి పెరిగింది. గత నెలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వివిధ కాల వ్యవధిలో ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ల మార్జినల్ కాస్ట్‌ను 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. కాగా MCLRను 2016 ఏప్రియల్ లో తీసుకొచ్చారు. దీనిలో బ్యాంకులు తమ నిధుల వ్యయాన్ని లెక్కించేందుకు ఒక ఫార్ములా ఇచ్చాయి. ప్రతి బ్యాంకు తన MCLRని నిధుల సమీకరణ, నిర్వహణ ఖర్చులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. హెచ్డీఎఫ్ సీ బ్యాంకు తాజాగా తీసుకున్న నిర్ణయంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారిపై ప్రభావం పడనుంది.
HDFC బ్యాంకు తాజా నిర్ణయంతో కొత్తగా లోన్ తీసుకోవాలనుకున్నా వాటిపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. పెంచిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు అన్ని టెన్యూర్లలోని రుణాలకు వర్తిస్తుంది. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ సహా ఎంసీఎల్ఆర్ రేటు ప్రాతిపదికన రుణం పొందిన వారందరిపైనా తాజా నిర్ణయంతో ప్రభావం పడబోతోంది. దీంతో ప్రతి నెలా చెల్లించాల్సిన EMI పెరగనుంది. కొత్త రేట్ల ప్రకారం చూస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.2 శాతానికి చేరింది. MCLR రేటు ఒక్కో బ్యాంక్‌లో ఒక్కోలా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత నాలుగు నెలల్లో కూడా ఎంసీఎల్ఆర్ రేటును పెంచుకుంటూనే వచ్చింది. మళ్లీ ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరోసారి రుణ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..