AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Digital Banking: నో క్యూ లైన్.. నో టెన్షన్.. ఇంట్లో నుంచే అన్ని పనులను చేసుకోండి.. SBI డిజిటల్ సేవలను ఇలా..

Digital Banking Services: మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఖాతాదారులు. అయితే బ్యాంకింగ్ సర్వీసులను మరింత సౌకర్యవంతంగా మార్చింది ఎస్బీఐ.

SBI Digital Banking: నో క్యూ లైన్.. నో టెన్షన్.. ఇంట్లో నుంచే అన్ని పనులను చేసుకోండి.. SBI డిజిటల్ సేవలను ఇలా..
Sbi
Sanjay Kasula
|

Updated on: Sep 08, 2022 | 3:29 PM

Share

SBI Digital Banking Services:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India)  దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇది ఎప్పటికప్పుడు వివిధ బ్యాంకింగ్ సేవల (Banking Services) ప్రయోజనాన్ని తన వినియోగదారులకు అందిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ సేవలను డిజిటల్ (Digital Banking) మాధ్యమంతో అనుసంధానం చేసేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఎస్బీఐ( SBI ) కూడా ఇందులో నిరంతరం ప్రయత్నిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, SBI యోనో, డోర్‌స్టెప్ సేవలు మొదలైన అనేక రకాల సౌకర్యాలను బ్యాంక్ తన కస్టమర్‌లకు అందజేస్తూనే ఉంది. ఇది కాకుండా, మీరు కూడా చిన్న పనుల కోసం బ్యాంకుకు వెళ్లకూడదనుకుంటే.. మీరు ఈ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను(Digital Banking Services) సద్వినియోగం చేసుకోవచ్చు. బ్యాంక్ తన కస్టమర్‌లకు ఎలాంటి డిజిటల్ సేవలను అందజేస్తుందో  మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సౌకర్యాలు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో అందుబాటులో ఉన్నాయి

మారుతున్న కాలానికి అనుగూనంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఖాతాదారులు. అలాంటి సమయంలో నెట్ బ్యాంకింగ్ వారి పనిని చాలా ఈజీ చేస్తుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ఇంటర్నెట్ ద్వారా బ్యాంక్ ఖాతాలో మనీ ట్రాన్స్‌ఫర్(Money Services) ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. మీరు డిమాండ్ డ్రాఫ్ట్ (Demand Draft)సమస్య కోసం కూడా ఇందులోనే అభ్యర్థించవచ్చు. దీనితో పాటు, మీరు వర్క్ లోన్, హోమ్ లోన్, చెక్ బుక్ ఇష్యూ మొదలైన అనేక రకాల సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు, మీరు నెట్ బ్యాంకింగ్ (Net Banking)ద్వారా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను (Bank Statement) కూడా పొందవచ్చు.

ఈ మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులకు అనేక సౌకర్యాలను అందిస్తుంది SBI –

1. మీరు UPI ద్వారా చెల్లింపు చేయాలనుకుంటే.. మీరు BHIM SBI పే యాప్ ద్వారా ఈ పనిని సులభంగా చేసుకోవచ్చు. ఇది UPI ద్వారా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును పంపడంలో, స్వీకరించడంలో సహాయపడుతుంది. 2. SBI సెక్యూర్ OTP యాప్ ద్వారా మీరు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌లను సులభంగా నిర్దారించుకోవచ్చు. 3. మీరు YONO SBI ద్వారా మొబైల్ బ్యాంకింగ్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. మీరు లోన్ అప్లికేషన్, క్రెడిట్/డెబిట్ కార్డ్, చెక్ బుక్ అప్లై, ఖాతా తెరవడం వంటి సేవలను దీని ద్వారా పొందవచ్చు 4.  YONO Business SBI ఖాతా ద్వారా మీ వ్యాపారానికి సంబంధించిన అన్ని పనులను మీరు చేయవచ్చు. INBతో వ్యాపారానికి సంబంధించిన సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు. వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ మొదలైనవి సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు. 5. SBI Quick అనేది మిస్డ్ కాల్ బ్యాంకింగ్ యాప్. దీని ద్వారా మీరు మీ ఖాతాలోని బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ATM కార్డ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ సమాచారం మొదలైన వాటికి కాల్ చేసి పొందవచ్చు. 6. Yono Lite SBI అనేది రిటైల్ మొబైల్ బ్యాంకింగ్ యాప్. దీని ద్వారా మీరు మీ డెబిట్ కార్డ్, పాస్‌బుక్ మొదలైన అనేక ఫీచర్ల గురించిన ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం