Gautam Adani: జెఫ్ బెజోస్‌తో పోటీ పడుతున్న గౌతమ్ ఆదానీ.. పెరిగిన సంపద.. త్వరలో రెండో స్థానం సాధించేనా..?
Gautam Adani: తొలుత ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించిన గౌతమ్ అదానీ.. ఆ తర్వాత వారెన్ బఫెట్, బిల్ గేట్స్‌లను వెనక్కి నెట్టేసి మూడో అత్యంత సంపన్నుడిగా..
Gautam Adani: తొలుత ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించిన గౌతమ్ అదానీ.. ఆ తర్వాత వారెన్ బఫెట్, బిల్ గేట్స్‌లను వెనక్కి నెట్టేసి మూడో అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ప్రస్తుతం అమెజాన్ జెఫ్ బెజోస్‌తో అదానీ పోటీపడుతున్నారు. అదానీ 2022లో ఆసియాలో అత్యంత ధనవంతుడు అయ్యాడు. గత వారం అతను ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడిగా రికార్డుకెక్కారు. ఇక అదానీ గ్రూప్ షేర్లు పెరుగుతుండడంతో అమెజాన్ కు చెందిన జెఫ్ బెజోస్‌తో పోటీ పడుతూ ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతులుగా అవతరించనున్నట్టు తెలుస్తోంది. గౌతమ్ అదానీ ఇప్పుడు జెఫ్ బెజోస్ కంటే 6 బిలియన్ డాలర్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు. జెఫ్ బెజోస్ సంపద 149 బిలియన్ డాలర్లు కాగా, గౌతమ్ అదానీ సంపద ఇప్పుడు 143 బిలియన్ డాలర్లు.
వారంలో సంపద 6 బిలియన్ డాలర్లు పెరిగింది:
గత వారం గౌతమ్ అదానీ ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా జాబితాలో ఉండగా, ఆయన సంపద 137 బిలియన్ డాలర్లు. అయితే ఒక్క వారంలోనే ఆయన సంపద 6 బిలియన్ డాలర్లు పెరిగింది. అదానీ గ్రూప్ షేర్లలో విపరీతమైన పెరుగుదల కారణంగా గౌతమ్ అదానీ నికర విలువ $143 బిలియన్లకు చేరుకుంది. అదానీ గ్రూప్ షేర్లు పెరుగుతూనే ఉన్నాయి. వీరిద్దరి మధ్య కేవలం 6 బిలియన్ డాలర్ల సంపద మాత్రమే తేడా ఉందని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ సంపద 2022లో $67 బిలియన్లు పెరిగింది. అంతకుముందు ఫ్రెంచ్ వ్యాపార దిగ్గజం ఎల్‌విఎంహెచ్ మోయెట్ హెన్నెస్సీ లూయిస్ విట్టన్ యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టేసి గౌతమ్ అదానీ ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు. జనవరి 1, 2020 తర్వాత అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్ 1982 శాతం రాబడిని ఇచ్చింది. ఈ కాలంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1613 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 1277 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ వాటా 1105 శాతం, అదానీ పవర్ 539 శాతం, అదానీ పోర్ట్స్ 134 శాతం, అదానీ విల్మార్ 161 శాతం రాబడిని అందించాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి