Viral Video: మ్యాచ్ పెట్టిన మంట.. పాకిస్తాన్ అభిమానులను పొట్టు పొట్టుగా కొట్టిన ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్స్.. షాకింగ్ వీడియో

ఓటమిని భరించలేని ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్స్ స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. పాకిస్థాన్ ఫ్యాన్స్‌ను చితకబాదారు. మ్యాచ్ ముగిసిన అనంతరం.. ఇరుదేశాల ఫ్యాన్స్ మధ్య జరిగిన ఈ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది.

Viral Video: మ్యాచ్ పెట్టిన మంట.. పాకిస్తాన్ అభిమానులను పొట్టు పొట్టుగా కొట్టిన ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్స్.. షాకింగ్ వీడియో
Asia Cup 2022
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 08, 2022 | 1:11 PM

Clashes between fans of Afghanistan, Pakistan: ఆసియా కప్‌లో భాగంగా బుధవారం షార్జాలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనుక్షణం ఉత్కంఠభరితంగా కొనసాగింది. నువ్వా నేనా అన్నట్టు హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో అప్ఘానిస్తాన్‌పై పాకిస్థాన్ గెలుపొంది ఫైనల్‌కు చేరింది. అయితే.. ఈ మ్యాచ్‌ అటు పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ ఆటగాళ్ల మధ్య.. ఇటు ఫ్యాన్స్ మధ్య దుమారం లేపింది. ఓటమిని భరించలేని ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్స్ స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. పాకిస్థాన్ ఫ్యాన్స్‌ను చితకబాదారు. మ్యాచ్ ముగిసిన అనంతరం.. ఇరుదేశాల ఫ్యాన్స్ మధ్య జరిగిన ఈ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఆప్ఘనిస్తాన్ ఫ్యాన్స్.. పాకిస్తాన్ ఫ్యాన్స్‌ను పిడిగుద్దులు గుద్దారు. అంతటితో ఆగకుండా స్టేడియంలో కూర్చిలను విరగ్గొట్టారు. పాకిస్తాన్‌కు ఓ వ్యక్తిని ఆఫ్ఘన్ వ్యక్తి కుర్చీతో చితకబాదుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ జిందాబాద్ అనే నినాదాలతో స్టేడియం మారుమోగిపోయింది. స్టేడియంలోనే కాకుండా బయట కూడా పాక్, ఆఫ్ఘన్ అభిమానులు కొట్టుకోవడం ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మరింత రచ్చకు దారితీసింది.

కాగా.. దీనిపై పాకిస్తాన్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌ను సాకుగా ఉపయోగించుకుని ఆఫ్ఘన్‌లపై జాత్యహంకారానికి పాల్పడ్డారని.. ఇది సిగ్గులేనితనం అంటూ పాక్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మీరంటే మీరంటూ ఇరుదేశాల నెటిజన్లు ట్విట్లు చేసుకుంటున్నారు. దీనిపై పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ కూడా ఫైరయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో..

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి ఫైనల్‌కు చేరింది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. పాక్ పేస్ బౌలర్ నసీమ్ షా వరుసగా రెండు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు.

అయితే.. 19వ ఓవర్ ఐదో బంతికి, ఆసిఫ్ అలీ వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. దానికంటే ముందు బంతి అంటే 19వ ఓవర్ నాలుగో బంతికి అసిఫ్‌ సిక్స్ కొట్టాడు. దాన్ని దృష్టిలో ఉంచుకున్న ఫరీద్.. అసిఫ్ ఔట్ అవగానే అతనివైపు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే, ఫరీద్ చర్యలకు ఆగ్రహానికి లోనైన ఆసిఫ్.. బ్యాట్ పైకి ఎత్తి కొట్టబోయాడు. అప్పటికీ వెనక్కి తగ్గని ఫరీద్.. ఆసిఫ్ భుజాన్ని తట్టి, దూషిస్తూ మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

ఇంతలో ఆఫ్ఘన్ టీమ్ మెంబర్స్ కల్పించుకుని వారిద్దరినీ విడదీశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాక్ అభిమానులు పాకిస్తాన్.. అంటూ కేరింతలు కొట్టారు. దీన్ని తట్టుకోలేని ఆఫ్ఘానిస్తాన్ ఫ్యాన్స్ పాకిస్థాన్ అభిమానులను చితకబాదారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..