Mystery Eggs: తాబేలు గూళ్ళలో ‘మిస్టరీ’ గుడ్లు.. ఇవేంట్రా బాబూ అని బుర్ర గోక్కుంటున్న పరిశోధకులు

Mystery Eggs: నదీ ఒడ్డున గానీ, సముద్ర తీరంలో గానీ తాబేళ్లు గూళ్లు పెట్టి వాటిల్లో గుడ్లు పెడుతుంటాయి. ఆ గుడ్లలోంచి తాబేలు పిల్లలు బయటకు వస్తాయి.

Mystery Eggs: తాబేలు గూళ్ళలో ‘మిస్టరీ’ గుడ్లు.. ఇవేంట్రా బాబూ అని బుర్ర గోక్కుంటున్న పరిశోధకులు
Mystery Eggs
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 08, 2022 | 2:15 PM

Mystery Eggs: నదీ ఒడ్డున గానీ, సముద్ర తీరంలో గానీ తాబేళ్లు గూళ్లు పెట్టి వాటిల్లో గుడ్లు పెడుతుంటాయి. ఆ గుడ్లలోంచి తాబేలు పిల్లలు బయటకు వస్తాయి. అయితే, తాజాగా కొందరు పరిశోధకులు తాబేలు గూళ్లను పిశీలించగా.. షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. వాటిని చూసి వారు షాక్ అయ్యారు. అవేంటో అంతుపట్టక.. పరిశోధనలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే.. లాగర్‌హెడ్ తాబేలు గూళ్లలో అంతుపట్టి గుడ్లు బయటపడ్డాయి. నార్త్ కరోలినాలోని పరిశోధకులు ఈ వింత గుడ్లను కనిపెట్టారు.

నార్త్ కరోలినా తీరం వెంబడి అనేక లాగర్ హెడ్ తాబేళ్లు గూళ్లు పెట్టి అందులో గుడ్లు పెడుతుంటాయి. అయితే, తాజాగా పరిశోధకులు స్పేసర్ అని పిలువడే గుడ్లను కనిపెట్టారు. ఇదే విషయాన్ని కేప్ హటేరాస్ నేషనల్ సీషోర్ పార్క్ సర్వీస్ ఇన్‌స్టాగ్రమ్ ద్వారా వెల్లడించారు. స్పేసర్ గుడ్లు తాబేళ్ల సాదారణ గుడ్ల కంటే చిన్నవిగా, అసాధారణ ఆకారాన్ని కలిగి ఉన్నాయి. గుడ్లలో పచ్చసొన ఉండదని, ఇవి పొదగవని చెబుతున్నారు. వాస్తవానికి లెదర్ బ్యాక్ తాబేలు గూళ్లలో ఈ స్పేసర్ గుడ్లు సర్వసాధారణంగా కనిపిస్తాయని, కానీ, లాగర్‌హెడ్ గూళ్లలో స్పేసర్ గుడ్లు కనిపించడం అసాధారణం అని పేర్కొంటున్నారు పరిశోధకులు.

ఇవి కూడా చదవండి

‘‘స్పేసర్ ఎగ్ పేరు స్పేస్ ఫిల్లింగ్ ఫంక్షన్‌ను సూచించినప్పటికీ, ఈ గుడ్ల కు సంబంధించిన వివరాలు ఇప్పటికీ రహస్యంగా ఉన్నాయి.’’ అని పార్క్స్ అధికారులు పేర్కొన్నారు. ‘‘అవి గూడు కుహరంలోకి ఇసుక పడకుండా నిరోధించే అవకాశం ఉంది. లేదా అసలైన గుడ్లను ఇతర జీవులు తినకుండా అడ్డుకోవచ్చు. తాబేళ్లు గుడ్డు పెట్టే క్రమంలో పొరపాటుగా ఏర్పడినవి కావొచ్చు.’’ అని రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తంగా ఈ గుడ్ల రహస్యాన్ని తేల్చే పనిలో పడ్డారు పరిశోధకులు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..