Video Viral: జాతీయ జెండాతో స్కూటీ క్లీనింగ్.. వీడియోపై నెటిజన్లు ఫైర్.. చట్టపరమైన చర్యలుంటాయని పోలీసుల వార్నింగ్
జాతీయ జెండాను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. దీనిని చిన్నప్పటి నుంచే నేర్పిస్తుంటారు. త్రివర్ణ పతాకం ఎక్కడ కనిపించినా లేచి సెల్యూట్ కొట్టడం మనకు అలవాటే. మూడు రంగుల జెండాను అవమానపరిచేలా ప్రవర్తించినా, నిబంధనలకు...
జాతీయ జెండాను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. దీనిని చిన్నప్పటి నుంచే నేర్పిస్తుంటారు. త్రివర్ణ పతాకం ఎక్కడ కనిపించినా లేచి సెల్యూట్ కొట్టడం మనకు అలవాటే. మూడు రంగుల జెండాను అవమానపరిచేలా ప్రవర్తించినా, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినా చట్టప్రకారం నేరంగా పరిగణిస్తారు. ఫలితంగా మూడేళ్లపాటు జైలుకు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాం. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశాం. ఈ క్రమంలో ఓ వ్యక్తి తాను చేసిన పనికి నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. తన ద్విచక్ర వాహనాన్ని క్లీన్ చేసేందుకు క్లాత్ కు బదులుగా జాతీయ జెండాను ఉపయోగించాడు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో జరిగింది. ఈ వీడియోలో వ్యక్తి తన స్కూటర్‌ను త్రివర్ణ పతాకంతో శుభ్రం చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు షూట్ చేసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ये व्यक्ति अपने देश के झंडे तिरंगे ??से अपनी scooty साफ़ कर रहा है।ये रोज़ाना इसी प्रकार अपनी Scooty साफ़ करता है। Scooty number-DL10SY5491 Owned by -Soni Zaidi गाड़ी का insurance भी expire हो चुका@DelhiPolice @dtptraffic कृपया मामले का संज्ञान ले उचित कार्यवाही निश्चित कराएँ pic.twitter.com/nlacPILKMr
ఇవి కూడా చదవండి— Hem Men (@hem_men1) September 7, 2022
కాగా.. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సదరు వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు, అతని పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాతీయ జెండా, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అయితే తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, పొరపాటున తెలియక చేశానని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..