Chia Seeds: ఆ ఐదు సమస్యలకు చియా విత్తనాలతో చక్కటి పరిష్కారం.. రెగ్యులర్‌గా తింటే బోలెడన్ని లాభాలు..

వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. రోజూ చియా గింజలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి.

Chia Seeds: ఆ ఐదు సమస్యలకు చియా విత్తనాలతో చక్కటి పరిష్కారం.. రెగ్యులర్‌గా తింటే బోలెడన్ని లాభాలు..
Chia Seeds
Follow us

|

Updated on: Sep 08, 2022 | 9:10 AM

Chia Seeds benefits: ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. కావున ప్రజలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని కోసం, ఆరోగ్యకరమైనవిగా భావించే వాటినే తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో సాధారణ చియా విత్తనాలను రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిదంటున్నారు. వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. చియా గింజలు తినడం మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించటానికి ఇదే కారణం. చియా విత్తనాల వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చియా విత్తనాలలో కనిపిస్తాయి. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే చాలా మంది ఆరోగ్య నిపుణులు చియా గింజలు తినమని సలహా ఇస్తున్నారు.
  2. చియా గింజలు గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మన రక్తపోటును సాధారణంగా ఉంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అందువల్ల, గుండె రోగులు తప్పనిసరిగా చియా విత్తనాలను తినాలి.
  3. చియా గింజలలో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీంతో మన కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. దీని కారణంగా మీరు అతిగా తినడాన్ని తగ్గించుకుంటారు. ఫలితంగా బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు భోజన సమయంలో చియా గింజలను తింటే.. అప్పుడు పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోదు.
  4. కోవిడ్ -19 మహమ్మారి, అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి రోగనిరోధక శక్తి మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం. రోగ నిరోధకశక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు చియా విత్తనాలలో కనిపిస్తాయి.
  5. చియా గింజలలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరంలో సోడియం మొత్తాన్ని తక్కువగా ఉంచడంలో సహాయపడుతుంది. చియా గింజలు తింటే రక్తపోటు పెరగదు. కావున బీపీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే తప్పనిసరిగా ఈ విత్తనాలను తినాలని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం