Viral: ఆ పని చేసిందని అత్త వేళ్లను కరకర కొరికేసిన కోడలు.. అడ్డొచ్చిన భర్తను కూడా వదల్లేదు.. ఆ మహాతల్లి..!

అత్తలు కోడళ్లను.. హింసించే సందర్భాలను చాలానే చూశాం.. కానీ ఓ కోడలు మాత్రం చిన్న పనికే అత్తకు పెద్ద శిక్ష వేసింది. ఏంటంటే..

Viral: ఆ పని చేసిందని అత్త వేళ్లను కరకర కొరికేసిన కోడలు.. అడ్డొచ్చిన భర్తను కూడా వదల్లేదు.. ఆ మహాతల్లి..!
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 08, 2022 | 9:58 AM

Viral News: సాధారణంగా అత్తాకోడళ్ల మధ్య ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది. అందుకే వారి మధ్య గొడవ ఓ పట్టాన కొలిక్కి రాదంటూ ఛలోక్తులు విసురుతుంటారు. అత్తలు కోడళ్లను.. హింసించే సందర్భాలను చాలానే చూశాం.. కానీ ఓ కోడలు మాత్రం చిన్న పనికే అత్తకు పెద్ద శిక్ష వేసింది. ఏంటంటే.. అత్త చేతి వేళ్లను కొరికేసింది. ఈ వింత ఘటన మహారాష్ట్రలోని థాణె జిల్లా అంబర్‌నాథ్‌ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. టీవీ వాల్యూమ్ విషయంలో జరిగిన గొడవలో.. కోడలు అత్త కుడి చేతి మూడు వేళ్లను కొరికడంతోపాటు.. అడ్డొచ్చిన భర్తను కూడా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అంబర్‌నాథ్‌లోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కోడలుపై కేసు నమోదు చేశారు. అయితే ఇంకా అరెస్టు చేయలేదని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి వేళ అత్త వృశాలీ కులకర్ణి (60) ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండగా.. హాలులో ఉన్న కోడలు విజయ (32) టీవీ చూస్తూ ఉంది. అయితే.. సౌండుతో పూజకు అంతరాయం కలుగుతోందని, టీవీ కట్టేయమని అత్త కేకేలు వేసింది. అయినప్పటికీ.. కోడలు అత్త మాటలను వినకుండా ఇంకా టీవీ సౌండ్‌ను పెంచింది.

దీంతో కోపం పట్టలేక అత్త నేరుగా వచ్చి టీవీ కట్టేసి వెళ్లిపోయింది. దీంతో కోడలు.. అత్తతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. ఈ సమయంలో అత్త వేలు చూపించి మాట్లాడుతుండటంతో విజయ ఆమె చేతివేళ్లను పళ్లతో కరకర కోరికింది. దీంతో ఆమె చేతి వేళ్లకు గాయలయ్యాయి.ఈ క్రమంలోనే ఇద్దరికీ సర్దిచెబుదామని ఇంటి లోపలి నుంచి భర్త సౌరబ్‌ రాగా.. అతనితో కూడా విజయ గొడవకు దిగింది. భర్త అని చూడకుండా.. అతన్ని కూడా కొట్టిందని పోలీసులు తెలిపారు. అత్త మూడు వేళ్లు విరిగాయని.. ఆమె చికత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. అయతే.. గత కొన్నాళ్లుగా అత్త, కొడుకు, కోడలు మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఇది కుటుంబ కలహాల వ్యవహారంగా అనిపిస్తోందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..