Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. ఏయే రూట్లలో అంటే..
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నర్సాపూర్, యశ్వంత్ పూర్ మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల సర్వీసులను..
Special Trains: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నర్సాపూర్, యశ్వంత్ పూర్ మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా… తాజాగా యశ్వంతపూర్, నర్సాపూర్ కు స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది. నర్సాపూర్ – యశ్వంతపూర్ మధ్య సెప్టెంబర్ 9, 11వ తేదీల్లో ఈప్రత్యేక రైలు నడవనుంది. నర్సాపూర్ నుంచి ఉదయం 03.20 గంటలకు బయల్దేరుతుంది. రైలు బయలుదేరిన తరువాత రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంతపూర్ కు చేరుకుంటుంది. ఇక యశ్వంతపూర్ నుంచి సెప్టెంబర్ 10, 12 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు రైలు బయల్దేరుతుంది. రైలు బయలుదేరిన తరువాత రోజు ఉదయం 8.30 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది. ఈప్రత్యేక రైలు నర్సాపూర్ లో బయలుదేరిన తర్వాత పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, దోనకొండ, మార్కాపూర్ రోడ్, నంద్యాల్, డోన్, అనంతపూర్, ధర్మవరం, పెనుకొండ, హిందూపూర్, ఎల్హాంక రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. నర్సాపూర్, యశ్వంత్ పూర్ మథ్య నడిచే ఈప్రత్యేక రైలు సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
హైదరాబాద్ నుంచి తిరుపతికి కూడా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతోంది. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ స్పెషల్ రైళ్లు బయలుదేరతాయి. సెప్టెంబర్‌లో తిరుపతి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వీటిని ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సెప్టెంబర్ 13, 20, 27 తేదీల్లో హైదరాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇవి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వన్ వే స్పెషల్ ట్రైన్స్ మాత్రమే. హైదరాబాద్ నుంచి తిరుపతికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సెప్టెంబర్ 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.15 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సులేహల్లి, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
మరిన్ని జాతీయవార్తల కోసం చూడండి..