Belly Fat: పొట్ట గుట్టలా పెరుగుతుందా..? బెల్లీ ఫ్యాట్‌కు ముఖ్య కారణం అదేనంట.. ఈ విషయాలను తెలుసుకోండి..

బెల్లీ ఫ్యాట్ మీ అద్భుత రూపాన్ని పాడు చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ సమస్య ఉన్నపుడు జీన్స్ ధరించడంలో, కింద కూర్చొవాలన్న ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Belly Fat: పొట్ట గుట్టలా పెరుగుతుందా..? బెల్లీ ఫ్యాట్‌కు ముఖ్య కారణం అదేనంట.. ఈ విషయాలను తెలుసుకోండి..
Belly Fat
Follow us

|

Updated on: Sep 08, 2022 | 6:51 AM

Reasons for Belly Fat: ఆధునిక జీవితంలో చాలామంది అధిక బరువు లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నడుము దగ్గర పేరుకుపోయిన కొవ్వును బెల్లీ ఫ్యాట్ అంటారు. బెల్లీ ఫ్యాట్ మీ అద్భుత రూపాన్ని పాడు చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ సమస్య ఉన్నపుడు జీన్స్ ధరించడంలో, కింద కూర్చొవాలన్న ఇబ్బంది పడాల్సి వస్తుంది. బెల్లీ ఫ్యాట్ చాలా మొండిగా ఉంటుంది. దాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు. అలాంటి పరిస్థితిలో మీరు కూడా బెల్లీ ఫ్యాట్ వల్ల ఇబ్బంది పడుతుంటే.. చింతించాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది.. దీనికి కారణాలేంటో తెలుసుకుంటే.. దానిని నివారించవచ్చని పేర్కొంటున్నారు.

బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణాలు..

తక్కువ ప్రోటీన్ అల్పాహారం: ఆకలిని తగ్గించడానికి, అతిగా తినకుండా నిరోధించడానికి ప్రోటీన్ సహాయపడుతుంది. 30 శాతం కేలరీలలో ప్రోటీన్ తీసుకోవడం బరువు తగ్గడానికి మంచిది. ఇది మాత్రమే కాదు ఇది మీ జీవక్రియను మెరుగుపర్చి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీని కోసం, మీ అల్పాహారంలో తృణధాన్యాలు, మొలకలను చేర్చుకోవచ్చు. మరోవైపు, మీరు తక్కువ ప్రోటీన్ అల్పాహారం తీసుకున్నా బెల్లీ ఫ్యాట్ పెరగడం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

కాలేయంపై డిటాక్స్ ప్రభావం: కాలేయం బాగా లేకుంటే మీరు అనేక వ్యాధులకు గురవుతారు. ఇది మాత్రమే కాదు బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. అందుకే వారానికి ఒకసారి కాలేయాన్ని డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే బెల్లీ ఫ్యాట్ బారిన పడే అవకాశం ఉంది.

నిద్ర సరిగా పట్టకపోవడం: రోజులో తగినంత నిద్ర లేకపోయినా బెల్లీ ఫ్యాట్ బారిన పడే అవకాశం ఉంది. రాత్రి వేళ మీరు కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే.. చిటికెడు దాల్చినచెక్కతో చమోలి టీని తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రాత్రిపూట మంచిగా నిద్ర వస్తుంది. సరిపడా నిద్రపోతే బెల్లీ ఫ్యాట్‌ను దూరం చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం