AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆ మూడు జిల్లాల్లో శుక్రవారం సెలవు.. అధికారిక ఉత్తర్వులు జారీ.. కానీ..

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో కన్నులపండువగా జరుగుతున్నాయి. నగర వ్యాప్తంగా కొలువుదీరిన గణనాథులు రేపు (శుక్రవారం) గంగమ్మ ఒడికి పయనం కానున్నారు. ఈ మేరకు...

Hyderabad: ఆ మూడు జిల్లాల్లో శుక్రవారం సెలవు.. అధికారిక ఉత్తర్వులు జారీ.. కానీ..
Vinayaka Immersion
Ganesh Mudavath
|

Updated on: Sep 08, 2022 | 4:44 PM

Share

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో కన్నులపండువగా జరుగుతున్నాయి. నగర వ్యాప్తంగా కొలువుదీరిన గణనాథులు రేపు (శుక్రవారం) గంగమ్మ ఒడికి పయనం కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సెలవు దినంగా ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌ కుమార్‌ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. రేపటి సెలవుకు (Holiday) బదులుగా నవంబరు 12న (రెండో శనివారం) పనిదినంగా ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వివరాలు వెల్లడించారు.

మరోవైపు.. గణేశ్ నిమజ్జనానికి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నారు. ట్యాంక్ బండ్ లో గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఏయే రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టత ఇచ్చారు. ఇక వినాయక నిమజ్జనం కోసం రాచకొండ పరిధిలోని సరూర్ నగర్, నల్ల చెరువుకట్ట ఉప్పల్, సఫిల్ గూడ లాంటి ఇతర ట్యాంక్ లపైనా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే అవసరమైనన్ని క్రేన్లు అందుబాటులో ఉంచారు.

శుక్రవారం (రేపు) ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు పై ప్రధాన ఊరేగింపు మార్గంలో విగ్రహాల ఊరేగింపు తప్ప మరే ఇతర ట్రాఫిక్ అనుమతించమని అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. పరిస్థితి అవసరమైతే ట్రాఫిక్ ఆంక్షలు పొడిగిస్తామని స్పష్టం చేశారు. తెలుగు తల్లి జంక్షన్ నుండి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ మీదుగా ఖైరతాబాద్ వరకు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం