Ganesh Nimajjanam Highlights: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి.. బైబై గణేషా అంటూ భక్తజనం వీడ్కోలు..

|

Updated on: Sep 09, 2022 | 7:35 PM

Khairatabad Ganesh Shobha Yatra Updates: నిమజ్జన మహోత్సవం... భాగ్యనగరాన్ని మరింత భాగ్యవంతంగా మార్చే పర్వదినం. నవరాత్రుల్లో భక్తుల నుంచి పూజలందుకుని... వస్తా.. వెళ్లొస్తా.. అంటూ గణేశుడు..

Ganesh Nimajjanam Highlights: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి.. బైబై గణేషా అంటూ భక్తజనం వీడ్కోలు..
Khairatabad Ganesh 2022

Khairatabad Ganesh Shobha Yatra Updates: ఆధ్యాత్మికత ఒకవైపు.. అదుర్స్ అనిపించే జోష్‌ఫుల్ ఎట్మాస్పియర్ మరోవైపు.. టోటల్ హైదరాబాద్‌ని తనవైపు తిప్పుకునే నిమజ్జన మహోత్సవం.. రెండు తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకం. ఖైరతాబాద్‌ భారీ గణనాధుడి నిమజ్జనం కోసం.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది భక్తులు నిమజ్జన వేడుకను చూసేందుకు రావడంతో సాగర తీరం సందడిగా మారింది. ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర.. వైభవంగా జరిగింది. నగరం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తజనం.. జయ, జయ ధ్వానాల మధ్య.. బొజ్జ గణపయ్య యాత్ర జరుగుతోంది. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తులు నినాదాలు చేస్తూ గణనాథునికి వీడ్కోలు పలుకుతున్నారు.

గతేడాది కూడా బాలాపూర్‌ లడ్డూ రికార్డ్‌ సృష్టించింది. 2019లో 17.60 లక్షలు పలికింది. కరోనా నేపథ్యంలో 2020లో మాత్రం వేలం వేయలేదు. సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందజేశారు. 2021లో 18లక్షల 90వేల రూపాయల ధర పలికింది. మర్రి శశాంక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. 2019 కంటే లక్షా 30వేల రూపాయలు అధికంగా వచ్చాయి. తాజాగా రికార్డు బ్రేక్ చేస్తూ.. 24.60 లక్షలకు బాలాపూర్ లడ్డూ దక్కించుకున్నారు లక్ష్మరెడ్డి అనే వ్యక్తి. ఇక ఖైరతాబాద్ వినాయకుని శోభయాత్ర ప్రారంభమైంది.

భాగ్యనగరంలో ఇవాళ జరగబోయే నిమజ్జన మహోత్సవానికి సర్వం సిద్దమైంది. 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్‌ చుట్టూ 32 భారీ క్రేన్స్ ఏర్పాటు చేసారు అధికారులు. 33 చెరువులు, 74 ప్రత్యేక కొలనులు, 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లు సిద్ధమయ్యాయి. 168 GHMC గణేశ్ యాక్షన్ టీమ్స్‌ రెడీ కాగా.. విధుల్లో 10 వేల మంది శానిటేషన్ కార్మికులు పాల్గొననున్నారు.

ఇటు.. హైదరాబాద్‌ పాతబస్తీలోనూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పాతబస్తీలో పర్యటించిన పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. పాతబస్తీ-బాలాపూర్‌ గణేశ్‌ ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు కమిషనర్‌ సీవీ ఆనంద్‌. ఎలక్ట్రిక్ సిటీ, GHMC డిపార్ట్‌మెంట్ రూట్‌లో ఎలక్ట్రిక్ కేబుల్స్, సిమెంట్ బారికేడ్లను తొలగించారు.

ఇదే సమయంలో హైదరాబాదీ ముస్లింలకు మతపెద్దలు పిలుపునిచ్చారు. గంగాజమునా తెహజీబ్‌కు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో శాంతి, ప్రశాంతతకే పెద్దపీటన్నారు ముస్లిం మతపెద్ద కుబూల్‌ పాషా షిత్తారీ. ఇవాళ నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలు ఎక్కడికక్కడ స్థానిక మసీదుల్లోనే చేసుకోవాలని సూచించారు. ఖైదరాబాద్‌ మహా గణపతికి నిమజ్జన ఏర్పాట్లు చేపట్టారు. గణపతిని స్థానభ్రంశం చేసింది ఉత్సవ సమితి. నిన్న తొమ్మిదో రోజు కావడంతో గణపతిని ప్రతిష్టించిన స్థానం నుంచి కదిపారు. ఇప్పటికే ఖైదరాబాద్‌ గణపతి దగ్గర గ్యాలరీలను తొలగించారు. కాసేపట్లో భారీ గణపతిని లారీ మీద ఎక్కించే ప్రక్రియ జరుగుతుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Sep 2022 07:22 PM (IST)

    తీన్‌మార్‌ డ్యాన్స్‌‌తో దుమ్మురేపిన వి.హనుమంతరావు

    గణేష్‌ నిమజ్జన జోష్‌లో నేనుసైతం అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఆయన తీన్‌మార్‌ డ్యాన్స్‌ ఆడారు.

  • 09 Sep 2022 07:21 PM (IST)

    మినిట్‌ టు మినిట్‌ అబ్జర్వ్‌ చేస్తున్న పోలీసులు..

    గణేష్‌ నిమజ్జనంపై పోలీసులు పుల్‌ ఫోకస్‌ పెట్టారు. కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌ నుంచి మినిట్‌ టు మినిట్‌ అబ్జర్వ్‌ చేస్తున్నారు. శోభాయాత్ర రూట్‌లో ఏర్పాటు చేసిన 17 వందల సీసీకెమెరాల పుటేజీని ఏకకాలంలో ఇక్కడినుంచి పర్యవేక్షించే వీలుంది.

  • 09 Sep 2022 07:21 PM (IST)

    పాటలకు సింకయ్యేలా డ్యాన్సులేస్తూ..

    భాగ్యనగరంలో గణేషుడి శోభాయాత్ర అంటే... భక్తికి తోడు తీన్‌మార్‌ సందడి ఎప్పుడూ ఉంటుంది. ఈసారి కూడా నిమజ్జనోత్సవంలో రహదారుల వెంబడి నృత్యాలతో హోరెత్తించారు భక్తులు. వినాయకుడి పాటలకు సింకయ్యేలా డ్యాన్సులేస్తూ.. జోష్‌ఫుల్‌గా వీడ్కోలు చెప్పారు.

  • 09 Sep 2022 07:20 PM (IST)

    రికార్డు ధర పలికిన రాయదుర్గం మై హోం భుజా గేటెడ్ కమ్యూనిటీలో లడ్డూ

    రాయదుర్గం మై హోం భుజా గేటెడ్ కమ్యూనిటీలో లడ్డూ ప్రసాదం... రికార్డు ధర పలికింది. ఈసారి ఇరవై లక్షల యాభై వేలకు పాడుకున్నారు రావులపాలెంకు చెందిన మోతురి సత్తిబాబు-శ్రావణి దంపతులు. గత ఏడాది లడ్డూను సొంతం చేసుకున్న విజయ భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఈ లడ్డును స్వీకరించారు.

  • 09 Sep 2022 07:16 PM (IST)

    శోభాయమానంగా గణేశ్‌ నిమజ్జనం.. జనసంద్రమైన ముంబై మహానగరం..

    ముంబై జనసంద్రమైంది. మహానగరం రద్దీగా మారింది. వాణిజ్య నగరంలో గణేశ్‌ నిమజ్జనం శోభాయమానంగా సాగింది.

  • 09 Sep 2022 07:08 PM (IST)

    గణపతి బప్పా మోరియా అంటూ.. ఖైరతాబాద్ గణపయ్యకు వీడ్కోలు..

    గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తులు నినాదాలు చేస్తూ ఖైరతాబాద్ గణనాథునికి వీడ్కోలు పలికారు.

  • 09 Sep 2022 07:06 PM (IST)

    భక్తి నీరాజనాలు కెరటాల్లా..

    సాగరతీరం జనసంద్రమైంది. భక్తి నీరాజనాలు కెరటాల్లా ఎగిసిపడ్డాయి. ఇసుకేస్తే రాలనంత జనప్రభంజనం. ఈ సారి పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. 50 అడుగుల ఎత్తులో మట్టి తో చేసిన మహాగణపతికి చాలా ప్రత్యేకతులు ఉన్నాయి. మట్టితో విగ్రహ తయారు చేయడంతో 60 నుండి 70 టన్నులకు విగ్రహ బరువు చేరింది. విగ్రహ నిమర్జన తరలింపుకు 70 అడుగుల పొడువు, 11 అడుగుల వెడల్పు ఉన్న 26 టైర్ల టస్కర్ వాహనం ఏర్పాటు చేశారు అధికారులు. 100 టన్నుల బరువు మోయనున్న వాహనం.. ఖైరతాబాద్ విగ్రహాన్ని అవలీలగా తీసుకువచ్చింది. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నం 3 వద్ద ఖైరతాబాద్ గణనాథుడి నిమర్జనం జరిగింది

  • 09 Sep 2022 07:03 PM (IST)

    గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..

    గణపత్తి బప్పా మోరియా నినాదాలతో భాగ్యనగరం మార్మోగిపోయింది. గణనాథులను జలప్రవేశం చేయించేందుకు జంట నగరాలు కదిలొచ్చాయి. ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్‌ల శోభాయాత్రలు కన్నుల పండువగా సాగుతోంది. సాయంత్రం 7.01 గంటల టైమ్‌లో గంగమ్మ ఒడికి చేరాడు ఖైరతాబాద్‌ మహా గణపతి. మరికొద్ది సమయంలో బాలాపూర్‌ గణేష్ నిమజ్జనం పూర్తికానుంది.

  • 09 Sep 2022 06:06 PM (IST)

    మరికాసేపట్లో గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ గణేశుడు..

    ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. ట్యాంక్‌బండ్‌లోని క్రేన్‌ నెం 3కి చేరుకున్నాడు.  ఖైరతాబాద్‌ గణేశుని శోభయాత్ర.. టెలిఫోన్‌ భవన్‌ మీదుగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ నుంచి మొత్తం 2.5 కిలోమీటర్ల మేర సాగింది. 50 అడుగుల ఎత్తులో కొలువుదీరిన  మహాగణపతి హుస్సేన్‌ సాగర్‌కు వచ్చేసాడు. నిమజ్జనానికి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

  • 09 Sep 2022 05:14 PM (IST)

    కాసేపట్లో ఆ రెండు విగ్రహాలూ హుస్సేన్ సాగర్‌ దగ్గరకు..

    హుస్సేన్ సాగర్ నిమజ్జనం అంటే ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ మార్గ్. ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ విగ్రహాలు ఇక్కడే నిమజ్జనమవుతాయి. కాసేపట్లో ఖైరతాబాద్ వినాయకుడు హుస్సేన్ సాగర్‌ దగ్గరకు చేరుకుంటాడు. ఇప్పుడు హుస్సేన్‌ సాగర్ నలువైపులా కనిపిస్తున్న కోలాహలం కను విందు చేస్తోంది.

  • 09 Sep 2022 05:12 PM (IST)

    గంగ ప్రవేశం కోసం బారులు తీరిన..

    హైదరాబాద్ వాసులకు పెద్ద పండగ... గణేశ్ శోభాయాత్ర. నవరాత్రుల్లో భక్తుల నుంచి పూజలందుకున్న గణనాథులు.. గంగ ప్రవేశం కోసం బారులు తీరాయి. ఈ అరుదైన ఘట్టం కీలక దశకు చేరుకుంది. జయజయధ్వానాల మధ్య భాగ్యనగరంలో వైభవంగా జరుగుతోంది నిమజ్జనోత్సవం.

  • 09 Sep 2022 05:12 PM (IST)

    జంటనగరాల నలువైపుల నుంచి సాగరం వైపు..

    లక్షలాదిగా జనం... వేలాదిగా లంబోదరుని విగ్రహాలు... జంటనగరాల నలువైపుల నుంచి సాగరం వైపు దారితీశాయి. భాగ్యనగర వాసులందరి చూపూ నిమజ్జనం కీలక ప్రాంతమైన హుస్సేన్ సాగర్ వైపే ఫోకస్ అయింది. కొద్దిసేపు వర్షం పడినా విఘ్ననాధుడి శోభాయాత్రకు ఏమాత్రం ఆటంకం కలగలేదు.

  • 09 Sep 2022 04:53 PM (IST)

    క్రేన్ నెంబర్ 3 వద్దకు చేరుకుంటున్న ఖైరతాబాద్ వినాయకుడు..

    సాగర తీరం వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ వినాయకుడు. మరో 3వంద అడుగుల దూరంలో ఉన్నాడు వినాయకుడు. క్రేన్ నెంబర్ 3 వద్దకు చేరుకుంటాడు బొజ్జ గణపయ్యా..

  • 09 Sep 2022 04:38 PM (IST)

    అసోం సీఎం హిమంత పర్యటనలో భద్రతా వైఫల్యం..

    అసోం సీఎం హిమంత పర్యటనలో భద్రతా వైఫల్యం కనిపించింది. ఎంజే మార్కెట్‌లో హిమంత మాట్లాడుతుండగా.. భద్రతా వలయాన్ని ఛేదించి మైక్‌ లాక్కునే యత్నం చేశారు. ఎంజే మార్కెట్‌లో రెండు వర్గాలకు మధ్య తోపులాట జరిగింది. సీఎం హిమంతను సురక్షిత ప్రాంతానికి తరలించారు పోలీసులు. సీఎం హిమంత భద్రతను నిర్లక్ష్యం చేశారంటున్నారు బీజేపీ నేతలు.

  • 09 Sep 2022 04:18 PM (IST)

    తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ వినాయకుడు..

    ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ వద్దకు చేరుకుంది. మట్టితో రూపొందిన 50 అడుగులు ఎత్తైన ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కోసం భాగ్యనగరం ఆసక్తిగా చూస్తోంది. 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉన్న భారీ వాహనం మీద ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి బయల్దేరాడు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 దగ్గర.. గంగ వ్రవేశం చేస్తారు.

  • 09 Sep 2022 04:07 PM (IST)

    34 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు..- సీపీ స్టీఫెన్ రవీంద్ర

    సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని 34 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. నిమజ్జన ఏర్పాట్లను 10 డ్రోన్ కెమెరాలతో.. పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు సీపీ.

  • 09 Sep 2022 03:12 PM (IST)

    ఖైరతాబాద్ పోస్టాఫీసు సమీపంలోకి చేరుకున్నఖైరతాబాద్ గణేశుడు

    నిమజ్జన మహోత్సవం... భాగ్యనగరాన్ని మరింత భాగ్యవంతంగా మార్చే పర్వదినం. నవరాత్రుల్లో భక్తుల నుంచి పూజలందుకుని... వస్తా వెళ్లొస్తా అంటూ ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనానికి బయలెళ్లినాడు. ప్రస్తుతం ఖైరతాబాద్ పోస్టాఫీసు సమీపంలో ఉన్నాడు.

  • 09 Sep 2022 03:08 PM (IST)

    గణనాథునికి వీడ్కోలు పలుకుతున్న భక్త జనం..

    ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. వైభవంగా ప్రారంభమైంది. నగరం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తజనం.. జయ, జయ ధ్వానాల మధ్య.. బొజ్జ గణపయ్య యాత్ర మొదలైంది. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తులు నినాదాలు చేస్తూ గణనాథునికి వీడ్కోలు పలుకుతున్నారు.

  • 09 Sep 2022 01:41 PM (IST)

    అన్ని దారులు హుస్సేన్‌సాగర్‌ వైపే..

    ఖైరతాబాద్‌ వినాయకుడితో పాటు బాలాపూర్‌ వినాయకుడి శోభయాత్ర కొనసాగుతోంది. అన్ని దారులన్నీ హుస్సేన్‌ సాగర్‌ వైపు ఉన్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 09 Sep 2022 12:50 PM (IST)

    ప్రారంభమైన ఖైరతాబాద్‌ మహా గణపతి శోభయాత్ర

    ఖైరతాబాద్‌ మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. వినాయకునికి హారతి ఇచ్చి, దిష్టి తీసి నిర్వాహకులు శోభయాత్రను ప్రారంభించారు. ఈ నిమజ్జనోత్సవంలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

  • 09 Sep 2022 12:00 PM (IST)

    హుస్సేన్‌సాగర్‌ వైపు తరలి వస్తున్న వినాయకులు

    హుస్సేన్‌సాగర్‌ వైపు గణణాథులు తరలివస్తున్నాయి. ట్యాంక్‌ బండ్‌ వద్ద కోలాహాలం మొదలైంది. ఖైరతాబాద్‌ మహా వినాయకుడు నిమజ్జనం కోసం బలులుదేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. శోభయాత్ర నిర్వహించేందుకు వినాయకున్ని ట్రాలీలో ఎక్కించేందుకు వెల్డింగ్‌ పనులు జరుగుతున్నాయి.

  • 09 Sep 2022 11:25 AM (IST)

    నిమజ్జనానికి తరలిస్తుండగా కూలిన గణేష్‌ విగ్రహం

    హైదరాబాద్‌ నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. వర్షానికి తడిసిన 20 అడుగులు పొడవున్న వినాయకుడు.. నిమజ్జనానికి తీసుకెళ్తుండగా కూలింది. ఈ ఘనట నగరంలోని హిమాయత్‌నగర్‌లో చోటు చేసుకుంది.

  • 09 Sep 2022 11:01 AM (IST)

    బాలాపూర్‌ గణేష్‌ శోభయాత్ర ప్రారంభం

    బాలాపూర్‌ గణేష్‌ శోభయాత్ర ప్రారంభమైంది. మదీనా, చార్మినార్‌, అప్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌ మీదుగా శోభయాత్ర కొనసాగనుంది. 18.9 కిలోమీటర్ల మేర బాలాపూర్‌ గణేష్‌ శోభయాత్ర జరుగనుంది.

  • 09 Sep 2022 10:59 AM (IST)

    ఖైరతాబాద్‌ గణేష్‌ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి

    ఖైరతాబాద్‌ వినాయకుని నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వినాయకున్ని ట్రాలీలో ఎక్కించిన నిర్వాహకులు.. ట్రాలీలో వెల్డింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో శోభయాత్ర ప్రారంభం కానుంది.

  • 09 Sep 2022 10:49 AM (IST)

    గంగమ్మ ఒడికి చేరనున్న ఖైరతాబాద్‌ పంచముఖ మహాలక్ష్మీ గణపతి

    పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ప్రారంభం కానుంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి.

    ఒడిశాకు చెందిన క్లే ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో శిల్పి చిన్నస్వామి సారథ్యంలో 30 మంది క్లే ఆర్టిస్టులు మట్టి మహాగణపతి తయారీలో పాల్గొన్నారు.

  • 09 Sep 2022 10:43 AM (IST)

    ట్రాలీలో ఎక్కిన ఖైరతాబాద్‌ మహా వినాయకుడు

    ఖైరతాబాద్‌ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్‌ వినాయకుడిని ట్రాలీలోకి ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో 50 అడుగుల మహా గణేష్‌ శోభాయాత్ర ప్రారంభం కానుంది.

  • 09 Sep 2022 10:35 AM (IST)

    రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డూ వేలం

    బాలాపూర్‌ లడ్డూ రికార్డు స్థాయిలో పలికింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన లడ్డూ వేలం ప్రక్రియ ముగింది. పొంగిలేటి లక్ష్మారెడ్డి  రూ.24 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. గతేడాది రూ.18 లక్షల 90 వేలకు మర్రి శశాంక్‌ రెడ్డి దక్కించుకున్నారు.

  • 09 Sep 2022 10:33 AM (IST)

    రికార్డ్‌.. 24.60 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ

    బాలాపూర్‌ లడ్డూ వేలం ముగిసింది. గత ఏడాది రూ.18.90 లక్షలకు పోగా, ఈ ఏడాది రూ.24 లక్షల 60 వేలు పలికింది. ఈ లడ్డూను లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు.

  • 09 Sep 2022 10:28 AM (IST)

    21 లక్షలు దాటిన బాలాపూర్‌ లడ్డూ

    బాలాపూర్‌ లడ్డూ వేలం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 21 లక్షలు దాటింది.

  • 09 Sep 2022 10:21 AM (IST)

    వేలం పాట తర్వాత గణేష్‌ ఊరేగింపు ప్రారంభం

    బాలాపూర్‌ లడ్డూ వేలం ప్రారంభం కావడంతో భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వేలంలో లడ్డూ ఎంత పలుకుతుందోనని ఉత్కంఠ నెలకొంది. లడ్డూ వేలం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బాలాపూర్‌ గణేష్‌. ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తున్నారు. వేలం పాట అనంతరం బాలాపూర్‌ గణేష్‌ ఊరేగింపు కొనసాగనుంది.

  • 09 Sep 2022 10:08 AM (IST)

    ప్రారంభమైన బాలాపూర్‌ లడ్డూ వేలం

    బాలాపూర్‌ లడ్డూ వేలం ప్రక్రియం ప్రారంభమైంది. గత ఏడాది రూ.18.90లకు మర్రి శశాంక్‌ రెడ్డి దక్కించుకున్నారు. ఈ ఏడాది రూ.20 లక్షలకుపైనే పోతుందని ఉత్సవ కమిటి నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ వేలం పాటలో మొత్తం 21 మంది పోటీ పడుతున్నారు. ఈ లడ్డూ వేలంపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సారి రికార్డు స్థాయిలో వేలం పలికే అవకాశం ఉంది.

  • 09 Sep 2022 10:00 AM (IST)

    10 గంటలకు బాలాపూర్‌ గణేష్‌ శోభయాత్ర ప్రారంభం

    బాలాపూర్‌ లడ్డూ వేలం ప్రారంభం కానుంది. ఈ వినాయకుడి ఊరేగింపు 10 గంటలకు ప్రారంభం కానుంది. లడ్డూవేలం ప్రక్రియ కూడా మొదలైంది.

  • 09 Sep 2022 09:56 AM (IST)

    ఖైరతాబాద్‌ గణేషున్ని వాహనంపై ఎక్కించే ప్రయత్నాలు ప్రారంభం

    ఖైరతాబాద్‌ మహా వినాయకుడిని వాహనంపైకి ఎక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ క్రేన్‌ సహాయంతో గణేషుడి విగ్రహాన్ని లిఫ్ట్‌ చేసేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. వందలాది టన్నుల బరువు మోయగల భారీ లారీ, క్రేన్‌ సహాయంతో శోభయాత్ర ఏర్పాట్లు చేశారు.

  • 09 Sep 2022 09:54 AM (IST)

    ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకున్న మంత్రి తలసాని

    ఖైరతాబాద్‌ మహా వినాయకుడిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దర్శించుకున్నారు. ప్రపంచంలో కెల్లా హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి ఎంతో ప్రత్యేక ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

  • 09 Sep 2022 09:45 AM (IST)

    చరిత్రలోనే తొలిసారిగా 50 అడుగుల మట్టి విగ్రహం

    67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలోనే తొలిసారి 50 అడుగులు మట్టి విగ్రహాన్ని తయారు చేసింది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ. ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతేడాది హైకోర్ట్ ఆదేశించింది. అందరూ మట్టి విగ్రహాలే పెట్టాలనే సందేశాన్ని చెప్తూ.. ఈ సారి ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహానికి స్వస్తి పలికింది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ.

  • 09 Sep 2022 09:43 AM (IST)

    క్రేన్‌ నెంబర్‌ 4 వద్ద ఖైరతాబాద్‌ గణేష్‌ నిమజ్జనం

    తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్‌ మహాగణపతిని.. అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 దగ్గర ఈ మహాగణపతి నిమజ్జనం కానుంది.

  • 09 Sep 2022 09:37 AM (IST)

    ఎన్డీఆర్‌ మార్గ్‌లో బారులు తీరిన వినాయకులు

    హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన కోలాహలం కొనసాగుతోంది. గణనాథులు ఒక్కొక్కటిగా ట్యాంకుబండ్‌ బాటపడుతున్నాయి. పాతబస్తీ చార్మినార్‌, మోజాంజాహి మార్కెట్‌ నుంచి భారీ సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌ సాగర్‌ చేరుకుంటున్నాయి. శోభాయాత్రలో యువత, పిల్లలు డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. బ్యాండు, డీజీలతో హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు దద్దరిల్లుతున్నాయి. నిమజ్జన శోభాయాత్రలో కోలాటం, భజనలతో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నగరం నలుమూలల నుంచి వస్తున్న గణనాథులతో ట్యాంకుబండ్‌ ఆధ్మాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. ఎన్టీఆర్‌ మార్గ్‌ భక్తులతో కిక్కిరిసిపోయింది.

  • 09 Sep 2022 09:01 AM (IST)

    వరంగల్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు..

    ఈ రోజు మధ్యాహ్నం 02.00 నుండి రేపు ఉదయం 10.00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ములుగు, భూపాలపల్లి వైపు నుండి వచ్చే భారీ వాహనాలు ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా హైదరాబాద్ వైపు దారి మల్లించనున్నారు. భూపాలపల్లి, ఏటూరునాగరం ఖమ్మం వైపు వెళ్ళవలసినవి వాహనాలు కరుణాపురం వద్ద ఔటర్ రింగ్ రోడ్ వైపు దారి మల్లింపు. సిటీ లోపలికి ఎలాంటి వాహనాలు అనుమతించమని పోలీసులు తెలిపారు. ములుగు, పరకాల వైపు నుండి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుండి కెయుసి, సి.పి.ఓ., అంబేద్కర్ సెంటర్ మీదుగా బస్టాండ్ కు చేరుకునే విదంగా దారి మల్లింపు

  • 09 Sep 2022 08:58 AM (IST)

    ప్రారంభం కానున్న బాలాపూర్‌ లడ్డూ వేలం

    బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు కొనసాగుతోంది. కాసేపట్లో లడ్డూ వేలం పాట జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే బాలాపూర్ లడ్డూ వేలం ప్రత్యేకం. ఎప్పుడూ ఇక్కడ రికార్డ్ స్థాయిలో లడ్డూ వేలం పలుకుతుంది. అనంతరం శోభాయాత్ర మొదలుకానుంది. తీన్మార్ బ్యాండ్ స్టెప్పులు, భక్తుల కోలాహలంతో నిమజ్జన కార్యక్రమం జరగనుంది.

  • 09 Sep 2022 08:28 AM (IST)

    మరో సెంటరాఫ్ ఎట్రాక్షన్ బాలాపూర్ గణేషుడే

    హైదరాబాద్‌ గణేషుల్లో ఖైరతాబాద్ గణేశుడి తర్వాత... మరో సెంటరాఫ్ ఎట్రాక్షన్ బాలాపూర్ గణేషుడే. కేశవగిరి నుంచి ట్యాంక్‌బండ్‌ దాకా సాగే ఈ శోభాయాత్రపై పోలీసులు ఏర్పాట్లను సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి అవాంతరం కలగకుండా సాఫీగా యాత్ర సాగడానికి యంత్రాంగం కృషి చేస్తోంది.

  • 09 Sep 2022 08:26 AM (IST)

    బైంసాలో ముగిసిన గణేష్‌ నిమజ్జనం

    నిర్మల్ జిల్లా బైంసాలో గణేష్ నిమజ్జనం ఘనంగా ముగిసింది. గడ్డెన వాగులో నిమజ్జన కార్యక్రమాన్ని ముగించిన అధికారులు. ఉదయం 7 గంటలకే 129 వినాయక ప్రతిమలు నిమజ్జనం పూర్తి చేసుకున్నాయి. నగరంలో శోభయాత్ర ప్రశాంత ముగిసింది.

  • 09 Sep 2022 08:23 AM (IST)

    106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లు

    33 చెరువులు, 74 ప్రత్యేక కొలనులు, 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లు సిద్ధమయ్యాయి. 168 GHMC గణేశ్ యాక్షన్ టీమ్స్‌ రెడీ కాగా.. విధుల్లో 10 వేల మంది శానిటేషన్ కార్మికులు పాల్గొననున్నారు.

  • 09 Sep 2022 07:59 AM (IST)

    ఖైరతావబాద్‌ మహా గణపతి దగ్గర కోలాహాలం

    ఖైరతాబాద్ మహా గణపతి దగ్గర నిమజ్జనం కోలాహాలం అప్పుడే మొదలయింది. ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఈ భారీ గణనాధుడి నిమజ్జనం కోసం.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది భక్తులు నిమజ్జన వేడుకను చూసి తరిస్తారు.

  • 09 Sep 2022 07:58 AM (IST)

    కాసేపట్లో బాలాపూర్‌ లడ్డూ వేలం

    బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు కొనసాగుతోంది. కాసేపట్లో లడ్డూ వేలం పాట జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే బాలాపూర్ లడ్డూ వేలం ప్రత్యేకం. ఎప్పుడూ ఇక్కడ రికార్డ్ స్థాయిలో లడ్డూ వేలం పలుకుతుంది. అనంతరం శోభాయాత్ర మొదలుకానుంది. తీన్మార్ బ్యాండ్ స్టెప్పులు, భక్తుల కోలాహలంతో నిమజ్జన కార్యక్రమం జరగనుంది.

  • 09 Sep 2022 07:37 AM (IST)

    బాలాపూర్‌ లడ్డూ వేలంలో 9 మంది పోటీ

    బాలాపూర్‌ లడ్డూవేలం 9 గంటలకు కొనసాగనుంది. ఈ వేలంలో లడ్డూ దక్కించుకునేందుకు మొత్తం 9 మంది పోటీ పడుతున్నారు. ఇందులో ఆరుగురు స్థానికులు, ముగ్గుర స్థానికేతరులు ఉన్నారు.

    Balapur

    Balapur

  • 09 Sep 2022 07:35 AM (IST)

    ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో భారీ బందోస్తు

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నేడు గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఆదిలాబాద్ , నిర్మల్, మంచిర్యాల జిల్లాలో వినాయక శోభయాత్ర కొనసాగుతోంది. ఈ జిల్లాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ లో 500 మంది, నిర్మల్ లో 450 మంది , మంచిర్యాలలో 350 పోలీసులతో నిత్యం పహారా కాస్తున్నారు.

  • 09 Sep 2022 07:32 AM (IST)

    కొత్త రికార్డు సృష్టించిన శుక్రవారం సెంటిమెంట్

    బాలాపూర్ గణేశుడి యాత్రకు ముందే అనేక ప్రాంతాల్లో అనేక గణనాథులు కలిలాయి. బషీర్ బాగ్ చౌరస్తాకు చేరుకున్న శోభాయాత్ర.. భారీ సంఖ్యలో విగ్రహాలు తరలివస్తున్నాయి. అయితే బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జనం శుక్రవారం రావడం సెంటిమెంట్‌గా మారింది. ప్రతిసారి కూడా శుభ్రవారం రావడం గమనార్హం.

    Balapur Ganesh

    Balapur Ganesh

  • 09 Sep 2022 07:15 AM (IST)

    గణేష్‌ ఉత్సవ సమితి సంతృప్తి

    ట్యాంక్ బండ్‌లో నిమజ్జన ఏర్పాట్లపై గణేష్ ఉత్సవ సమితి సంతృప్తి వ్యక్తం చేసింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఏర్పాట్లను సమితి పరిశీలించింది. ట్యాంక్‌బండ్‌పై అన్ని విగ్రహాలను అనుమతి ఇవ్వడం సంతోషమన్నారు గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు. దీని కోసమే తాము ఆందోళన చేశామన్నారు. హిందూ సాంప్రదాయం కోసం పోరాడే తమకు ఏ పార్టీతో సంబంధం లేదంటున్నారు.

  • 09 Sep 2022 07:13 AM (IST)

    బాలాపూర్‌ లడ్డూ రికార్డు స్థాయిలో పలికేనా..?

    భాగ్యనగర గణేష్‌ ఉత్సవాలు అంటే గుర్తుకు వచ్చేది బాలాపూర్‌ లడ్డూ.. నిమజ్జనం రోజున ఈ లడ్డూను దక్కించుకునేందుకు పోటీ తీవ్రంగా ఉంటుంది. వందలూ కాదు.. వేలూ కాదు.. లక్షలు పలుకుతుంది ఈ లడ్డూ.. ఏ ఏటికాఏడు రికార్డులను చెరిపేసుకుంటూ 2021లో జరిగిన వేలంలో ఏకంగా 18 లక్షల 90 వేలు దక్కించుకుంది. మరి ఇవాళ జరగబోయే లడ్డూ వేలంలో రికార్డు స్థాయిలో పలికే అవకాశం ఉంది.

  • 09 Sep 2022 07:08 AM (IST)

    అత్యధికంగా 9 సార్లు లడ్డూ దక్కించుకున్న కొలను ఫ్యామిలీ

    బాలాపూర్‌ లడ్డూ వేలం కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది అంతకంతకు వేలం పాట రికార్డు స్థాయికి చేరుకుంటుంది. ఈ యేడాది కూడా అదే జోష్‌లో వేలం పాటు కొనసాగనుంది. కొలను ఫ్యామిలీ అత్యధికంగా 9సార్లు లడ్డూ దక్కించుకుంది.

  • 09 Sep 2022 07:06 AM (IST)

    గత ఏడాది బాలాపూర్‌ లడ్డూ వేలం రూ.18.90 లక్షలు

    1994లో మొదలైన బాలాపూర్‌ లడ్డూ వేలం పాట.. వందలు కాదు..వేలు కాదు..లక్షల్లో వేలంపాట జరుగనుంది. గతేడాది రూ.18.90 లక్షలు పలికిన లడ్డూ ధర.. ఈ ఏడాది కూడా అంతకంటే ఎక్కువ పలికే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

  • 09 Sep 2022 07:05 AM (IST)

    బాలాపూర్‌ లడ్డూ వేలంలో భక్తుల పోటీ..

    బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గణపతి నైవేధ్యంలో 9 రోజులపాటు పూజలు అందుకుని చివరిరోజు వైభవంగా లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. బాలపూర్ లడ్డూ వేల కోసం భక్తుల మధ్య పోటీ నెలకొంది.

  • 09 Sep 2022 07:01 AM (IST)

    ఎంజే మార్కెట్ వద్ద వినాయకుల కోలాహలం

    ఎంజే మార్కెట్‌ వద్ద వినాయకుల కోలాహాలంగా నెలకొంది. శోభాయాత్రగా తరలివస్తున్నాయి. ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే వినాయక సాగర్ వైపు సాగుతున్న శోభాయాత్ర కొనసాగుతోంది. డీజే పాటలు, భక్తుల డ్యాన్స్ లతో శోభాయమానంగా వినాయక నిమజ్జన ఊరేగింపు కొనసాగుతోంది.

  • 09 Sep 2022 06:58 AM (IST)

    చిలకలగూడ ఎక్స్‌ రోడ్‌ నుంచి వచ్చే విగ్రహాలు..

    చిలకలగూడ ఎక్స్ రోడ్స్ నుంచి వచ్చే విగ్రహాలు ముషీరాబాద్‌లో చేరుతాయి. గాంధీ హాస్పిటల్ మీదుగా, ఈస్ట్‌జోన్ నుంచి మొదలయ్యే ఊరేగింపులు ఉప్పల్, రామంతపూర్, 6 నెం. జంక్షన్, అంబర్‌పేట్ శివం రోడ్, ఓయూ వద్ద ఎన్‌సీసీ దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ , హిందీ మహావిద్యాలయ ఎక్స్ రోడ్స్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్‌పురా ఎక్స్ రోడ్స్, నారాయణగూడఎక్స్ రోడ్స్ నుంచి వెళ్లి RTC X రోడ్స్ నుంచి వచ్చే ఊరేగింపులో కలుస్తాయి.

  • 09 Sep 2022 06:57 AM (IST)

    ఎర్రగడ్డ నుంచి వచ్చే వినాయకులు..

    ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్‌లో చేరి ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంటాయి.

  • 09 Sep 2022 06:49 AM (IST)

    ఈ మార్గాల్లో శోభయాత్ర కొనసాగుతుందిలా..

    ప్రధాన ఊరేగింపు కేశవగిరి నుంచి ప్రారంభమవుతుంది. చాంద్రాయణగుట్ట ఎడమ మలుపు, MBNR X రోడ్, ఫలక్‌నుమా ROB, అలియాబాద్, నాగుల్చింత, చార్మినార్ , మదీనా, అఫ్జల్‌గంజ్, SA బజార్, M.J.మార్కెట్, అబిడ్స్, బర్కర్‌షీర్, ఎన్టీఆర్ మార్గ్, PVNR మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపునకు వినాయక శోభాయాత్రలు సాగుతాయి.

  • 09 Sep 2022 06:48 AM (IST)

    గణేష్‌ నిమజ్జనానికి రూట్‌ మ్యాప్‌

    గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఏయే రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టత ఇచ్చారు.

  • 09 Sep 2022 06:45 AM (IST)

    ట్యాంక్‌ బండ్‌లో బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జనం

    బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పై 8 క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్‌లను సిద్ధంగా ఉంచారు. ఇవికాక ఎన్టీఆర్ మార్గ్‌లో మరో 9 క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో 3 క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు.

  • 09 Sep 2022 06:36 AM (IST)

    నిమజ్జనానికి రెడీ అవుతున్న ఖైరతాబాద్‌ గణేష్‌

    ఖైదరాబాద్‌ మహా గణపతికి నిమజ్జన ఏర్పాట్లు చేపట్టారు. గణపతిని స్థానభ్రంశం చేసింది ఉత్సవ సమితి. నిన్న తొమ్మిదో రోజు కావడంతో గణపతిని ప్రతిష్టించిన స్థానం నుంచి కదిపారు. ఇప్పటికే ఖైదరాబాద్‌ గణపతి దగ్గర గ్యాలరీలను తొలగించారు. కాసేపట్లో భారీ గణపతిని లారీ మీద ఎక్కించే ప్రక్రియ జరుగుతుంది.

  • 09 Sep 2022 06:23 AM (IST)

    ప్రారంభమైన బాలాపూర్‌ లడ్డూ వేలం

    బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఉదయాన్ని లడ్డూ వేలం పాట మొదలైంది. గణపతి నైవేధ్యంగా 9 రోజులపాటు పూజలు చివరిరోజు వైభవంగా లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. ఈ లడ్డూ కోసం భక్తుల మధ్య పోటీ నెలకొంది.

  • 09 Sep 2022 06:21 AM (IST)

    నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్‌లు

    గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై భారీగా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పై 8 క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్‌లను సిద్ధంగా ఉంచారు. ఇవికాక ఎన్టీఆర్ మార్గ్‌లో మరో 9 క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో 3 క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు.

  • 09 Sep 2022 06:18 AM (IST)

    ట్యాంక్‌ బండ్‌పై కదులుతున్న వినాయకులు

    జంట నగరాల్లోని గణనాధులు నిమజ్జనానికి సిద్ధమయ్యాయి. నిన్న రాత్రి నుంచే కొన్ని ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. ఇప్పటి వరకు మంటపాల్లో విశేష పూజలందుకున్న గణనాథులు..ట్యాంక్‌బండ్‌వైపు కదులుతున్నాయి.

Published On - Sep 09,2022 6:17 AM

Follow us
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..