AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malaria Vaccine: గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి రానున్న మలేరియా వ్యాక్సిన్‌.. పరిశోధనలో అద్భుతమైన ఫలితాలు

Malaria Vaccine: దోమల నుంచి వ్యాపించే వ్యాధి మలేరియా. ఈ వ్యాధి ఎంతో మందిని పట్టి పీడిస్తోంది. తాజాగా మలేరియా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు..

Malaria Vaccine: గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి రానున్న మలేరియా వ్యాక్సిన్‌.. పరిశోధనలో అద్భుతమైన ఫలితాలు
Malaria Vaccine
Subhash Goud
|

Updated on: Sep 09, 2022 | 12:47 PM

Share

Malaria Vaccine: దోమల నుంచి వ్యాపించే వ్యాధి మలేరియా. ఈ వ్యాధి ఎంతో మందిని పట్టి పీడిస్తోంది. తాజాగా మలేరియా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశోధకులు కృషి చేస్తున్నారు. మలేరియా R21/Matrix వ్యాక్సిన్‌ను డెవలప్‌ చేస్తున్నారు పరిశోధకులు. ఇప్పటికే ట్రయల్ రన్‌ కూడా నిర్వహించారు. మూడు డోసులతో మలేరియాను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు తేల్చారు. ఈ మలేరియా వ్యాక్సిన్ ఈ దోమల ద్వారా సంక్రమించే వ్యాధికి వ్యతిరేకంగా 70 నుండి 80 శాతం రక్షణను అందించగలదని ‘ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో తెలిపింది. UKలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, యాంటీ మలేరియా వ్యాక్సిన్ R21/Matrix-M బూస్టర్ డోస్ (R21/Matrix-M మలేరియా వ్యాక్సిన్) ఇచ్చిన తర్వాత టీకా తీసుకునేవారిపై నిర్వహించిన రెండవ దశ పరిశోధన ఫలితాలను వెల్లడించారు.

ఈ మలేరియా వ్యాక్సిన్‌కు లైసెన్స్ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) వద్ద ఉంది. 2021లో తూర్పు ఆఫ్రికాలోని పిల్లలపై నిర్వహించిన పరిశోధనలో ఈ వ్యాక్సిన్ 12 నెలల పాటు మలేరియా నుండి 77 శాతం రక్షణను అందించడంలో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. అయితే ఈ వ్యాక్సిన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. R21/Matrix-Mకు చెందిన మూడు ప్రారంభ మోతాదుల అనంతరం బూస్టర్ డోస్ ఇచ్చిన మంచి ఫలితాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మలేరియా వ్యాక్సిన్ టెక్నాలజీ రోడ్‌మ్యాప్ లక్ష్యాన్ని చేరుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు

ఈ పరిశోధనలో బుర్కినా ఫాసోకు చెందిన ఐదు నుండి 17 నెలల మధ్య వయస్సు గల 450 మంది పిల్లలు పాల్గొన్నారు. వీటిని మూడు గ్రూపులుగా విభజించారు. మొదటి రెండు గ్రూపుల్లో 409 మంది పిల్లలకు యాంటీ మలేరియా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అందించారు. అదే సమయంలో మూడవ సమూహంలోని పిల్లల రాబిస్ నివారణలో సమర్థవంతమైన టీకా ఇవ్వబడింది. అన్ని టీకాలు జూన్ 2020లో ఇవ్వబడ్డాయి. పరిశోధనలో యాంటీ-మలేరియా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పొందిన పాల్గొనేవారు 12 నెలల తర్వాత ఈ దోమల ద్వారా వ్యాపించే వ్యాధికి వ్యతిరేకంగా 70 నుండి 80 శాతం రోగనిరోధక శక్తిని పొందినట్లు నిపుణులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, బూస్టర్ డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత పాల్గొనేవారిలో ‘యాంటీబాడీస్’ స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు. బూస్టర్ మోతాదు తర్వాత పాల్గొనేవారిలో ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించలేదని వారు నివేదించారు. లీడ్ పరిశోధకుడు హలీడు టింటో మాట్లాడుతూ, వ్యాక్సిన్ ఒక బూస్టర్ డోస్‌తో మరోసారి ఇంత అధిక రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడం చాలా అద్భుతంగా ఉంది. మేము ప్రస్తుతం చాలా పెద్ద స్థాయి మూడవ రౌండ్ ట్రయల్స్‌ని నిర్వహిస్తున్నాము. తద్వారా వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది విస్తృతంగా ఉపయోగించడానికి లైసెన్స్ పొందవచ్చు. త్వరలో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు అభిప్రాయపడ్డారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి