AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mental Health Tips: మానసికంగా స్ట్రాంగ్‌ అవ్వాలంటే ఈ 5 టిప్స్ పక్కా ఫాలో అవ్వండి..

Improve Mental Health Tips: ప్రస్తుత కాలంలో కోటీశ్వరుడు మొదలు.. బీదవారి వదరకు అందరూ ఏదోరకంగా మానిసక వేదనకు గురవుతూనే ఉంటారు.

Mental Health Tips: మానసికంగా స్ట్రాంగ్‌ అవ్వాలంటే ఈ 5 టిప్స్ పక్కా ఫాలో అవ్వండి..
Mental Health
Shiva Prajapati
|

Updated on: Sep 09, 2022 | 12:57 PM

Share

Improve Mental Health Tips: ప్రస్తుత కాలంలో కోటీశ్వరుడు మొదలు.. బీదవారి వదరకు అందరూ ఏదోరకంగా మానిసక వేదనకు గురవుతూనే ఉంటారు. కారణం జీవిన విధానంతో పాటు.. రకరకాల అంశాలున్నాయి. ఈ ఒత్తిడి వ్యక్తి మనసునే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా దారుణంగా కృంగదీస్తుంది. ఫలితంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. ముందు మానసికంగా దృఢంగా ఉండాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. మనం శారీరక ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తామో.. మానసిక ఆరోగ్యానికి కూడా అంతేస్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే.. ఎంతటి కష్టతరమైన పని అయినా సునాయాసంగా అయిపోతుంది. మరి ప్రస్తుత ఉరుకులు, పరుగుల బిజీ జీవితంలో మానసికంగా స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత..

1. ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

2. హేతుబద్ధమైన ఆలోచనలో సహాయపడుతుంది.

3. ఆత్మగౌరవానికి తోడ్పడుతుంది.

4. జీవితంలో సమతుల్యతను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది.

5. ఉత్పాదక పనిలో సహాయపడుతుంది.

పోషకాహార నిపుణులు అంజలి ముఖర్జి తెలిపిన వివరాల ప్రకారం.. ‘పోషకాహార లోపాలు, మానసిక ఆరోగ్యానికి మధ్య పరస్పర సంబంధం ఉంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, అధికంగా కెఫిన్ పదార్థాలు తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో ఏ లోపం వచ్చినా అది ముందుగా మెదడును ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా ముందుగా మీ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా మీ మనస్సును స్ట్రాంగ్‌గా మార్చుకోవచ్చు.’ అని పేర్కొన్నారు.

మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఏం చేయాలి..

1. మెరుగైన జీవన శైలిని పాటించాలి.

2. మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.

3. ప్రతి రోజూ వ్యాయామం, యోగా వంటివి చేయాలి.

4. ధూమపానం, మద్యం సేవించడం మానుకోవాలి.

6. అవసరమైన మేరకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..