Capsicum Benefits: ఇందుకే కదా క్యాప్సికమ్ తినమని చెప్పేది.. దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
క్యాప్సికమ్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దాని పై తొక్క నుంచి విత్తనాల వరకు ప్రతిదీ ప్రయోజనకరంగా ఉంటుంది.
Capsicum Health Benefits: క్యాప్సికమ్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు దాగున్నాయి. మిరపజాతికి చెందిన క్యాప్సికమ్.. ఆహార రుచిని పెంచుతుంది. ప్రతి వంటకాన్ని స్పైసీగా మార్చడానికి క్యాప్సికమ్ కలుపుతారు. క్యాప్సికమ్‌ను పిజ్జా నుంచి పరాటాల వరకు అన్నింటిలోనూ ఉపయోగిస్తారు. అయితే ఈ రుచికరమైన కూరగాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. క్యాప్సికమ్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దాని పై తొక్క నుంచి విత్తనాల వరకు ప్రతిదీ ప్రయోజనకరంగా ఉంటుంది. అందులో ఉండే లక్షణాల గురించి, ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
క్యాప్సికమ్ విత్తనాల ప్రయోజనాలు..
ఈ కూరగాయలోని ప్రతి భాగం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. ముఖ్యంగా దాని విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. క్యాప్సికమ్ గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఖనిజాలు దాగున్నాయి. ఇవి పలు సమస్యలను దూరం చేస్తాయి.
క్యాప్సికమ్ ప్రయోజనాలు
- క్యాప్సికమ్ తినడం వల్ల గుండెకు మేలు కలుగుతుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్, సైటో కెమికల్స్ ఉంటాయి.
- క్యాప్సికమ్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- క్యాప్సికమ్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. థర్మోజెనిసిస్ ఇందులో కనిపిస్తుంది. ఇది మన శరీరంలో కేలరీలను చాలా వేగంగా కరిగిస్తుంది. కాబట్టి డైట్‌లో ఉన్నా.. క్యాప్సికమ్‌తో చేసిన వాటిని నిర్మొహమాటంగా తినవచ్చు.
- క్యాప్సికమ్‌లో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, చక్కెర, ఫైబర్, కొవ్వు పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలు శరీరానికి పూర్తి పోషణను అందిస్తాయి.
- క్యాప్సికమ్‌లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. మన జుట్టు, చర్మానికి మేలు చేస్తుంది. దీంతోపాటు కళ్లకు మేలు చేసే ల్యూటిన్ కూడా దీనిలో ఉంది.
- క్యాప్సికమ్ తినడం మధుమేహ రోగులకు కూడా మేలు కలుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పలు సమస్యలను దూరం చేస్తాయి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం