AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 38 నుంచి 89 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Heatwave
Shaik Madar Saheb
|

Updated on: Mar 12, 2026 | 2:21 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 38 నుంచి 89 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఈ రోజు ఉదయము 0530 గంటలకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతము తక్కువగా గుర్తించబడింది. దిగువ ట్రోపో ఆవరణములో ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆగ్నేయ, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

రాయలసీమ :-

గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 3 డిగ్రీలు సాధారణము కంటే ఎక్కువగా నమోదు అవుతూ, ఆ తరువాత 4 రోజుల్లో క్రమంగా తగ్గే అవకాశముంది. రాయలసీమలో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 – 3 డిగ్రీలు సాధారణము కంటే ఎక్కువగా నమోదు అవుతూ, ఆ తరువాత 3 రోజుల్లో క్రమంగా తగ్గే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నవి. నిన్న బీహార్ ప్రాంతం నుండి ఉత్తర చత్తీస్‌గఢ్ వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీనపడింది.

వీటి ప్రభావంతో గురువారం, శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us