AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Men Health Tips: మగాళ్లూ ఇది మీకే .. శరీరంలో ఆ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం లేట్ చేయొద్దు..

Men Health Tips: వయసు పెరిగే కొద్దీ పురుషులలో హార్మోన్ల మార్పుల కారణంగా టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతుంటాయి. దీని వల్ల మోనోపాజ్ సమస్యలు తలెత్తుతాయి.

Men Health Tips: మగాళ్లూ ఇది మీకే .. శరీరంలో ఆ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం లేట్ చేయొద్దు..
Men Health
Shiva Prajapati
|

Updated on: Sep 09, 2022 | 12:21 PM

Share

Men Health Tips: వయసు పెరిగే కొద్దీ పురుషులలో హార్మోన్ల మార్పుల కారణంగా టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతుంటాయి. దీని వల్ల మోనోపాజ్ సమస్యలు తలెత్తుతాయి. మహిళల్లో, రుతుక్రమం సాపేక్షంగా తక్కువ వ్యవధిలోనే అండోత్సర్గము పూర్తిగా ముగుస్తుంది. కానీ, పురుషుల్లో తగ్గిన టెస్టోస్టెరాన్ స్థాయిలు, హార్మోన్ ఉత్పత్తి నెమ్మదిగా, క్రమంగా జరుగుతుంది. అందుకే పురుషులు 30 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వచ్చిన తర్వాత, ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ టెస్టోస్టెరాన్ 1% చొప్పున నెమ్మదిగా క్షీణిస్తుంది. అలాగని టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోదు. కానీ.. వృద్ధాప్యం, మధుమేహం, హెచ్‌టీఎన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 45 నుంచి 50 ఏళ్ల వయస్సు వచ్చేసరికి పురుష ప్రత్యు్త్పత్తి వ్యవస్థలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఒక వ్యక్తికి 70 ఏళ్లు దాటిన తర్వాత అతని టెస్టోస్టెరాన్ స్థాయిలలో 50% క్షీణత ఉంటుంది. అంతేకాకుండా.. ఊబకాయం, టైప్ 2 మధుమేహం, హార్మోన్ల లోపాలు, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు కూడా సాధారణం కంటే ముందుగానే ఆండ్రోపాజ్‌ సమస్యకు దారీతీయొచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆండ్రోపాజ్‌ సమస్యకు కారణాలు..

తక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి, వయస్సు పెరుగుదల, SHBG (సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్) అని పిలువబడే హార్మోన్ అధిక ఉత్పత్తి ఆండ్రోపాజ్‌కు కారణం అవుతుంది.

ఇవి కూడా చదవండి

లక్షణాలు..

శరీరంలో అధిక కొవ్వు, అంగస్తంభన లోపం, లిబిడో తగ్గడం (తక్కువ సెక్స్ డ్రైవ్), నిద్ర లేకపోవడం, చర్మం సన్నబడటం, పొడి చర్మం, నిరాశ, తక్కువ శక్తి, వేడి, కండర శక్తి తగ్గుదల, ఏకాగ్రత లోపించడం, విపరీతమైన చెమట, హైపర్హైడ్రోసిస్ వంటివి ఉంటాయి. కొంతమంది పురుషుల్లో బోలు ఎముకల వ్యాధి, హృదయ సంబంధ సమస్యల వంటి తీవ్రమైన సమస్యలతో కూడా బాధపడవచ్చు.

వ్యాధి నిర్ధారణ..

యూరాలజిస్ట్ లేదా ఆండ్రోలజిస్ట్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. శారీరక పరీక్ష, లక్షణాల ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది. రోగ నిర్ధారణ తర్వాత తదుపరి చికిత్సను ఆలస్యం చేయొద్దు.

చికిత్స..

స్కిన్ ప్యాచ్‌లు సహాయపడతాయి. టెస్టోస్టెరాన్ ప్యాచ్ ధరించే వ్యక్తుల చర్మం ద్వారా హార్మోన్‌ను స్వీకరించడం జరుగుతుంది. టెస్టోస్టెరోన్ జెల్‌ను నేరుగా చర్మానికి, చేతులపై రాయొచ్చు. ఒకసారి ఉపయోగించిన తరువాత కాసేపటికి చేతులను శుభ్రం చేసుకోవాలి. క్యాప్సూల్స్‌ను రోజుకు రెండుసార్లు భోజనం తర్వాత తీసుకోవచ్చు. అయితే, గుండె జబ్బులు వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పురుషులు ఈ క్యాప్సూల్స్‌ను ఉపయోగించకూడదు. అదే సమయంలో వ్యాయామం, మంచి పోషకాహారం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటి జీవనశైలిలో మార్పులు కూడా ఆండ్రోపాజ్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతాయి. కొంతమంది పురుషులకు మందులు, టెస్టోస్టెరాన్ పునఃస్థాపన చికిత్సను కూడా సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అయితే, డాక్టర్ ఇచ్చిన మార్గదర్శకాలను మాత్రమే అనుసరించాలి. స్వీయ వైద్యం అసలుకే ప్రమాదం తెచ్చిపెడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..