బెల్లం ఆరోగ్యానికి మంచిదని తింటున్నారా? 

Velpula Bharath Rao

20 December 2024

22 December 2024

కొంతమంది చలికాలం వచ్చిందంటే తాజా బెల్లం కోసం వేచి చేస్తూ ఉంటారు. చలికాలంలో బెలం తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు.

బెల్లం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బెల్లం ఆరోగ్యానికి మంచి చేస్తుందని వైద్యులు సూచిస్తూ ఉంటారు. బెల్లం రుచిగా ఉంటుంది కాబట్టి తినడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు.

ముఖ్యంగా చలికాలంలో బెల్లం రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే మరీ బెల్లం ఎక్కువగా తింటే చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

బెల్లం ఎక్కువగా తీసుకుంటే మధుమేహం, అధిక బరువు పెరుగుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 

బెల్లం తీసుకోవడం వల్ల ఎముకలు చాలా స్టాంగ్‌గా ఉంటుంది. ఇంకా బెల్లంలో ఐరెన్ కూడా ఉంటుంది. ఈ ఐరన్‌ హిమోగ్లొబిన్‌ను పెంచుతుంది.

క్రమంగా బెల్లం తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చు. బెల్లం తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం సమస్యను కూడా నివారించవచ్చు.

చక్కెరకు బదులుగా బెల్లం తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. నిత్యం బెల్లం తింటే బ్లడ్ క్లీన్‌గా ఉంటుంది.

బెల్లం తినడం వల్ల డీహైడ్రేషన్ రిస్క్ నుంచి బయటపడవచ్చు. అలాగే చర్మం తేమను కాపాడుకోవడానికి బెల్లం యూజ్ అవుతుంది.