వామ్మో.. ఈ అలవాట్లు ఉన్నాయా..? మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..

కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అందువల్ల, ఈ ముఖ్యమైన అవయవాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.. అయితే మన అలవాట్లే లివర్ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయని.. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ అలవాట్లు ఏంటి..? నిపుణులు ఏం చెబుతున్నారు.. పూర్తి వివరాలు తెలుసుకోండి.

వామ్మో.. ఈ అలవాట్లు ఉన్నాయా..? మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
Liver Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 22, 2024 | 1:44 PM

కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం.. ఇది అనేక రకాల విధులను నిర్వహిస్తుంది.. అందుకే ఈ అవయవం పట్ల మనం ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాస్తవానికి కాలేయం జీర్ణక్రియ, నిర్విషీకరణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మీరు తిన్న వివిధ ఆహారాలను జీర్ణం చేయడానికి ముఖ్యమైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది అనవసరమైన సమ్మేళనాలను కూడా విచ్ఛిన్నం చేచేయడంతోపాటు.. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.

అయితే.. ఆయిల్ ఫుడ్స్, ఆల్కహాల్ వంటి హానికరమైన పదార్థాలు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే మన రోజువారీ అలవాట్లు కూడా కాలేయం ఆరోగ్యానికి మంచివి కావని.. మేలు బదులు హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన కాలేయం.. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తుందని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతారు.. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, మీ కాలేయం ఆరోగ్యాన్ని పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవాలి.. ఇలా చేయని వారి శరీరం క్రమంగా బలహీనపడుతుందని.. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

ఈ ఆహారాలు తినడం వల్ల కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుంది..

మన రుచిని సంతృప్తి పరచడానికి మనం తరచుగా స్వీట్లు, పానీయాలు తీసుకోవడం ప్రారంభిస్తాము.. ఇవే.. మన ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. హెల్తీ లివర్ కావాలంటే రెడ్ మీట్, సోడా, శీతల పానీయాలు, ఆల్కహాల్, ఆయిల్ ఫుడ్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

వీటికి దూరంగా ఉండండి..

అనారోగ్యకరమైన ఆహారంతోపాటు.. జీవనశైలిని అనుసరించడం వల్ల కూడా కాలేయం దెబ్బతింటుంది.. ముఖ్యంగా ఈ 3 చెడు అలవాట్లను వదిలివేయాలని నిపుణులు చెబుతున్నారు. మనం నిత్య జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు కాలేయానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఆహారంతోపాటు.. మీరు ఎలాంటి వాటిని నివారించాలో ఇప్పుడు తెలుసుకోండి..

పగటిపూట నిద్రపోయే అలవాటు: కొంతమందికి పగటిపూట నిద్రపోయే చెడు అలవాటు ఉంటుంది.. 10 నుంసీ 20 నిమిషాల పవర్ న్యాప్ తీసుకోవడం వల్ల ఎటువంటి హాని ఉండదు.. కానీ మీరు పగటిపూట అతిగా నిద్రపోతే.. అది కాలేయానికి హానికలిగిస్తుంది.

రాత్రి పూట మేల్కొని ఉండే అలవాటు: కొంతమందికి అర్థరాత్రి వరకు పని చేయడం లేదా లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం అలవాటుగా మారుతుంది. ఇంకా కొందరు టీవీలు, ఫోన్లు చూస్తూ కాలక్షేమం చేస్తుంటారు.. దీనివల్ల చాలా ఆలస్యంగా నిద్రపోతారు.. ఇది కాలేయ ఆరోగ్యానికి మంచిది కాదు.

చాలా కోపంగా ఉండటం: మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మన మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాదు, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యం. అందువల్ల, మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి