Rashmika Mandanna: ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ సినిమా హిట్ తెగ ఎంజాయ్ చేస్తుంది. యానిమల్ సినిమా తర్వాత మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న రష్మికకు ఇప్పుడు మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు మహేష్ అభిమానులకు సారీ చెప్పింది.
ఇక అసలు విషయానికి వస్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి వీరాభిమాని. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఓ విషయం చెప్పారు. తాను థియేటర్లో ఫస్ట్ చూసిన సినిమా విజయ్ దళపతి నటించిన గిల్లి అని తెలిపింది. ఆ తర్వాత సినిమా చెబుతూ.. ఆ సినిమా తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి మూవీకి రీమేక్ అని తనకు ఈ మధ్యే తెలిసిందని.. అందులోని అప్పుడి పోడి సాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తన లైఫ్ మొత్తంలో ఆ పాటకు ఎన్నోసార్లు స్టేజ్ మీద డ్యాన్స్ చేసినట్లు తెలిపింది. తాను స్క్రీన్ మీద చూసిన మొదటి హీరో విజయ్ అని.. ఫస్ట్ హీరోయిన్ త్రిష అని చెప్పుకొచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది.. ఇక్కడ రష్మిక చెప్పిన మహేష్ బాబు సినిమా పేరు పొరపాటుగా చెప్పింది.
గిల్లి సినిమా మహేశ్ నటించిన ఒక్కడు మూవీకి రీమేక్ గా తెరకెక్కించారు. కానీ రష్మిక పోకిరి రీమేక్ అని చెప్పడంతో ఆమెను సరదాగా ఆట పట్టిస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా అలాంటి ఓ పోస్టుకు రష్మిక తెలుగులో రిప్లై ఇచ్చింది. నిజంగా సారీ..నాకు వాళ్లు నటించిన అన్ని సినిమాలూ ఇష్టమే” అంటూ ఫన్నీ ఎమోజీలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.