Phone addiction: పిల్లలు ఫోన్ చూస్తూ తింటే.. ఇన్ని ఇబ్బందులు వస్తాయా?

పిల్లల ఇష్టానుసారం తల్లిదండ్రులు ప్రవర్తించిన ప్రతిసారీ అది పిల్లలకు హాని చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు భోజనం చేసేటప్పుడు ఫోన్‌లు చూస్తున్నట్లయితే ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాహార లోపంతో పాటు పిల్లల్లో ఊబకాయ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కొద్దిగా కష్టమైనా ఈ అలవాటు మాన్పించాలని సూచిస్తున్నారు.

Phone addiction: పిల్లలు ఫోన్ చూస్తూ తింటే.. ఇన్ని ఇబ్బందులు వస్తాయా?
Children With Phone
Follow us
Ravi C

|

Updated on: Dec 22, 2024 | 4:52 PM

స్మార్ట్​ ఫోన్​ రాకముందు పిల్లలకు చందమామను చూపిస్తూ లేదా కథలు చెబుతూ అన్నం తినిపించేవారు. కానీ ప్రస్తుత కాలంలో మొబైల్​ చూపించి పిల్లలకు భోజనం పెడుతున్నార. కానీ క్రమంగా అది పిల్లలకు అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు వల్ల ఫోన్ చూడకుండా తినడం తినలేకపోతారు. అంతేకాకుండా ఈ అలవాటు పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. పిల్లలకి ఫోన్ చూపించడం వల్ల చాలా రోగాలు వస్తాయి. మీ పిల్లలు భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌లను చూస్తే.. ఆ అలవాటును ఎంత కష్టమైనా మాన్పించడం మంచిది.

జీర్ణక్రియను బలహీనపరుస్తుంది

పిల్లవాడు మొబైల్ ఫోన్ చూస్తూ తిన్నప్పుడు, వారు అతిగా తింటారు లేదా తక్కువగా తింటారు. అంటే వారు ఆకలితో ఉన్నదానికంటే తక్కువ తింటారు. ఒక్కోసారి తిండి మీద ధ్యాస లేక అతిగా తింటారు. అతిగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది. తక్కువ తినడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఫోన్ చూస్తూ పిల్లలు ఆహారాన్ని నమలకుండా మింగేస్తారు. ఇది జీర్ణక్రియను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

జీర్ణ సమస్యలు

భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ చూడటం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అవసరానికి తగినట్లు తినకపోతే అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే ఫోన్ చూడటం వల్ల పిల్లలకు కళ్లు చెడిపోయే ప్రమాదం ఉంది. ఎక్కువగా స్క్రీన్​ను చూస్తే పిల్లల కళ్లు అలసిపోతాయి.  దీంతో కంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒత్తిడి, ఆందోళన

భోజనం చేసేటప్పుడు ఫోన్ చూడటం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే పిల్లవాడు ఫోన్ చూస్తూ సరిగ్గా తినడు. శరీరానికి పోషణ అందదు. దీంతో మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు.

పెరుగదలపైనా ప్రభావం

ఫోన్ చూడటం పిల్లల సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. ఇది పెరుగుదలలోనూ ప్రభావం చూపిస్తుంది. ఫోన్ చూస్తున్నప్పుడు, పిల్లవాడికి ఆకలి వేయదు. దీంతో సరిగా తినరు. ఫలితంగా శరీరం పోషకాహార లోపానికి గురవుతుంది. పిల్లల బరువు, ఎత్తు పెరగవు. సరైన పెరుగదల లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

ఫోన్​ మాన్పించాలంటే ఏం చేయాలి?

  • భోజనం చేసేటప్పుడు మీ పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
  • ఫోన్ ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం అని పిల్లలకు పదే పదే చెబుతూ ఉండండి.
  • పిల్లలకు మీరు దగ్గరగా ఉండి ఆహారం ఇవ్వండి. లేదా తినిపించండి. అలాగే, వాళ్లు తినేటప్పుడు వారిని గమనించడం మంచిది.