Tooth Brush and Nausea: బ్రష్‌ చేసేటప్పుడు మీకూ వాంతి అవుతుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..

కొంత మందికి ఉదయం సమయంలో బ్రష్ చేసేటప్పుడు మాటిమాటికీ వాంతి అవుతూ ఉంటుంది. ఇలా ఒకటి రెండు సార్లు అయితే పరవాలేదు. కానీ మాటిమాటికీ ఇలా జరిగితే మాత్రం అప్రమత్తం కావాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసులు ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి..

Srilakshmi C

|

Updated on: Dec 22, 2024 | 8:21 PM

చాలా మందికి పళ్ళు తోముకునేటప్పుడు వాంతులు అవుతుంటాయి. వాంతులు వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. కానీ చాలామంది దీనిని సాధారణ సమస్యగా పరిగణిస్తారు. ఇది కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే కాకుండా తరచుగా పళ్ళు తోముకున్న ప్రతిసారీ ఈ సమస్య తతెత్తితే అప్రమత్తంగా ఉండాలి.

1 / 5
మళ్లీ మళ్లీ వాంతులు కావడం వల్ల చికాకుగా ఉంటుంది. ముఖ్యంగా తిన్న తర్వాత బ్రష్ చేసేటప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే.. ఇందకు గల కారణాలను అన్వేషించాలి.

2 / 5
పొట్ట సమస్యలు కూడా దీనికి ఒక కారణం. దాన్ని వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలు ట్రై చేయండి. పెద్ద బ్రష్‌కు బదులు చిన్న టూత్ బ్రష్ వినియోగించాలి. అనేక సందర్భాల్లో పెద్ద బ్రష్‌ను ఉపయోగించడం వల్ల నోటి లోపల ప్రదేశం తక్కువగా ఉండటం వల్ల వాంతి ధోరణి పెరుగుతుంది. అలాగే కఠినంగా ఉండేది కాకుండా మృదువైన బ్రష్‌ని ఉపయోగించాలి. నెమ్మదిగా బ్రష్ చేయాలి.

3 / 5
కొన్నిసార్లు టూత్‌పేస్ట్ కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. తక్కువ ఫోమింగ్ ఉన్న టూత్‌పేస్ట్‌ని ఉపయోగించాలి. క్కువ నురుగు కారణంగా వాంతి ధోరణి కూడా తగ్గుతుంది.

4 / 5
మీరు బ్రష్ చేయడానికి ముందు నోటిలో కొంచెం నీరు పోసుకుని పుక్కిలించాలి. అనంతరం బ్రష్ చేయాలి. ఇది వికారం సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌ను కూడా ఉపయోగించవచ్చు. అయినా సమస్య కొనసాగితే మర్చిపోకుండా డెంటిస్ట్‌ను కలవాలి.

5 / 5
Follow us