- Telugu News Photo Gallery This is what happens when diabetics eat dragon fruit, Check Here is Details
Dragon Fruit: షుగర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ తింటే జరిగేది ఇదే..
ఈ మధ్య కాలంలో షుగర్ పేషెంట్స్ సంఖ్య బాగా పెరిగిపోయింది. వీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నా ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలనే డ్రాగన్ ఫ్రూట్ తినే విషయంలో ఆలోచిస్తూ ఉంటారు. మరి షుగర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో ఇప్పుడే చూడండి..
Updated on: Dec 22, 2024 | 5:43 PM

Dragon fruit

అయితే షుగర్ పేషెంట్స్ కొన్ని రకాల ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. కాబట్టి తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవి తినొచ్చా! అనే డౌట్ కూడా వస్తుంది. ఏది తినాలన్నా వెనకాముందు ఆలోచిస్తూ ఉంటారు.

డ్రాగన్ ఫ్రూట్ రుచి కూడా తియ్యగానే ఉంటుంది. కాబట్టి ఈ పండు తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయోమోనని ఆలోచిస్తారు. కానీ ఎలాంటి సందేహం లేకుండా షుగర్ పేషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చని వైద్యులు చెబుతున్నారు.

అయితే మరీ ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు. రోజుకు కేవలం వంద గ్రాములకు మించి తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయని అంటున్నారు.

ఈ ఫ్రూట్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ఇది తినడం వల్ల బీపీ, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయ పడుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




