వ్యాయామంతో పాటు ఈ ఆహారాలతో కండ‌లు తీరిన దేహం.. 

TV9 Telugu

21 December 2024

వ్యాయామం, ఆహారంతోనే తీరైన దేహాకృతిని సొంతం చేసుకోవ‌చ్చని అభిప్రాయపడుతున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు.

మ‌నం రోజూ తీసుకునే ఆహార ప‌దార్ధాలతోనే కండ‌రాలు సహజరీతిలో బ‌లోపేతం అవుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

వ్యాయామం ఎంత చేసినా కండ‌లు రావాలంటే అందుకు త‌గిన ఆహారం తీసుకోవడం మర్చిపోకూడదు. లేదంటే అస్సలు ఫలితం ఉండదు.

కండ‌రాలు, ఎముక పుష్టి ఉండాలంటే ముందుగా ప్రొటీన్స్‌తో కూడిన ఆహారం అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రొటీన్ అధికంగా ఉండే మాంసం, గుడ్లు, డైరీ ఉత్ప‌త్తులు త‌ర‌చూ తీసుకుంటే కండ‌రాల వృద్ధికి అవ‌స‌ర‌మైన ఎమినో యాసిడ్స్ దొరుకుతాయి.

మంచి కండలు రావడానికి త‌క్ష‌ణ శ‌క్తిని అందించే కార్బోహైడ్రేట్లు అవ‌స‌ర‌మ‌ని పలు అధ్యయనాలు నివేదించాయి.

వ‌ర్క‌వుట్స్ సంద‌ర్భంగా త‌లెత్తే అల‌స‌ట‌ను కార్బోహైడ్రేట్లు నిలువ‌రిస్తాయి. వీటితో పాటు ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి.

గ్రీక్ యోగర్ట్‌, సాల్మ‌న్‌, గుడ్లు, క్వినోవా, పాల‌కూర‌, చికెన్‌తో పాటు ఆరోగ్య‌క‌ర‌ ఫ్యాట్స్‌, ప్రొటీన్‌లు అందేలా చూసుకోవాలి.

సూక్ష్మ పోష‌కాలు అధికంగా ల‌భించే బాదం, వాల్‌న‌ట్స్‌, చియా సీడ్స్‌, జీడిపప్పు వంటి న‌ట్స్‌, సీడ్స్ అధికంగా తీసుకోవాలి.