AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R Ashwin: ‘అమ్మ ఆస్పత్రిలో ఉన్నా దేశం కోసం ఆడారు’.. టీమిండియా క్రికెటర్ అశ్విన్‌కు ప్రధాని మోడీ లేఖ

టీమిండియా సీనియర్ క్రికెటర్ ఆర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. అశ్విన్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అశ్విన్ రిటైర్మెంట్ పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే సమయంలో అతని భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ లేఖ రాశారు.

R Ashwin: 'అమ్మ ఆస్పత్రిలో ఉన్నా దేశం కోసం ఆడారు'.. టీమిండియా క్రికెటర్ అశ్విన్‌కు ప్రధాని మోడీ లేఖ
Ravichandran Ashwin, PM Narendra Modi
Basha Shek
|

Updated on: Dec 22, 2024 | 5:09 PM

Share

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ తర్వాత ఆర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. దీంతో అతను ఇప్పుడు దేశవాళీ క్రికెట్ పోటీలు, లీగ్ పోటీల్లో మాత్రమే కనిపించనున్నాడు. కాగా అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయంపై పలువురు దిగ్గజ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే సమయంలో అతని భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో అశ్విన్‌ రిటైర్మెంట్ తర్వాతి జీవితం బాగుండాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక లేఖ రాశారు. ‘ప్రతి ఒక్కరూ మీ నుంచి మరిన్ని ఆఫ్ బ్రేక్‌లు ఆశిస్తున్న తరుణంలో మీరు క్యారమ్ బాల్ బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 14 ఏళ్ల పాటు టీమిండియా కు సేవలు అందించినందుకు ధన్యవాదాలు’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ‘భారత క్రికెట్ జట్టుకు మీరు అందించిన సేవలు అద్భుతం. 2022 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై మీరు బాల్ ను వదిలి పెట్టడం, అది వైడ్ బాల్‌గా మారడం మీ తెలివితేటలను తెలియజేస్తుంది. ‘మీ అమ్మ ఆసుపత్రిలో చేరిన ఆ క్షణం మనందరికీ గుర్తుంది. అయినా మీరు మళ్లీ మైదానంలోకి దిగారు. ఇక చెన్నైలో వరదలు వచ్చినప్పుడు మీరు జట్టుతోనే ఉన్నారు. దక్షిణాఫ్రికాపై మీరు ఆడిన తీరు ఆట పట్ల మీ నిబద్ధతను తెలియజేస్తుంది. జెర్సీ నంబర్ 99 లేకపోవడం భారత క్రికెట్ జట్టుకు పెద్ద లోటు. మీరు క్రికెట్ మైదానంలో అడుగుపెట్టిన క్షణాన్ని క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు’.

‘మీ 765 వికెట్లు ఎంతో ప్రత్యేకమైనవి. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను గెలుచుకోవడం, మీరు సంవత్సరాలుగా జట్టు విజయంపై చూపిన ప్రభావాన్ని చూపుతుంది. ఒకే మ్యాచ్‌లో సెంచరీ చేసి ఐదు వికెట్లు పడగొట్టి మీ ఆల్ రౌండ్ సత్తాను చాలాసార్లు చూపించారు. అలాగూ 2021లో సిడ్నీలో మ్యాచ్ సేవింగ్ ఇన్నింగ్స్‌తో మన దేశానికి ఎన్నో మరపురాని జ్ఞాపకాలను అందించారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అశ్విన్ కు ప్రధాని మోడీ రాసిన లేఖ ఇదే..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..