Viral Video: వార్నింగ్ ఇచ్చినా వినని అభిమాని.. చిర్రెత్తిన బుమ్రా ఎయిర్ పోర్ట్‌లో ఏం చేశాడో తెలుసా..?
IND vs SA, Jasprit Bumrah: టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కోపంగా ఫ్యాన్ చేతిలోంచి ఫోన్ లాక్కుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన విమానాశ్రయంలో జరిగింది. దీంతో నెటిజన్లు పలు రకాల కామెంట్లతో చర్చకు దారితీశారు.

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే, మైదానం వెలుపల టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా ప్రవర్తన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఎంతో ప్రశాంతంగా ఉండే బుమ్రా, ఎయిర్‌పోర్ట్‌లో ఒక అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది?..
ఎయిర్‌పోర్ట్‌లో బుమ్రా క్యూలో నిలబడి ఉన్న సమయంలో, పక్కనే ఉన్న ఒక అభిమాని ఆయన అనుమతి లేకుండా సెల్ఫీ వీడియో తీయడం ప్రారంభించాడు. అది గమనించిన బుమ్రా, మొదట అతన్ని సున్నితంగా హెచ్చరించారు. “వీడియో తీయకండి, ఫోన్ పడిపోతే నా తప్పు కాదు” అంటూ వార్నింగ్ ఇచ్చారు.
వార్నింగ్ ఇచ్చినా వినకపోవడంతో..
బుమ్రా హెచ్చరించినప్పటికీ, ఆ అభిమాని వీడియో తీయడం ఆపలేదు. పైగా “పర్వాలేదు సార్” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో సహనం కోల్పోయిన బుమ్రా, ఒక్కసారిగా ఆ అభిమాని చేతిలోని ఫోన్‌ను లాక్కున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు కెమెరాలో నిక్షిప్తమై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వీడియోలోని సంభాషణ ఇలా ఉంది:
-
అభిమాని: “సార్, మీతోనే వస్తాను.”
-
బుమ్రా: “నీ ఫోన్ కింద పడిపోతే నన్ను అడగకు.”
-
అభిమాని: “పర్వాలేదు సార్.”
-
బుమ్రా: “అవునా.. అయితే సరే” అంటూ వెంటనే అతని ఫోన్ లాక్కున్నారు.
సోషల్ మీడియాలో చర్చ..
What an arrogant behavior by Jasprit Bumrah. First he threatened his fan that he would throw his phone, and later he snatched the fan’s phone. pic.twitter.com/O2e4jSLw7s
— 𝐆𝐨𝐚𝐭𝐥𝐢𝐟𝐢𝐞𝐝 👑 (@Goatlified) December 17, 2025
ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది “బుమ్రాకు ఎంత అహంకారం” అని విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం “ప్రైవసీని గౌరవించని అభిమానులకు బుమ్రా సరైన గుణపాఠం చెప్పారు” అంటూ మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా, ఎప్పుడూ కూల్‌గా ఉండే బుమ్రా ఇలా ఫైర్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
టీ20 సిరీస్‌లో భాగమైన బుమ్రా..
జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీం ఇండియా టీ20 సిరీస్‌లో పాల్గొంటున్నాడు. కటక్‌లో జరిగిన మొదటి టీ20లో అతను రెండు వికెట్లు పడగొట్టాడు. ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో అతనికి వికెట్ దక్కలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ధర్మశాలలో జరిగిన మూడో టీ20కి బుమ్రా దూరమయ్యాడు. లక్నోలో జరగాల్సిన నాల్గవ టీ20 రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఐదవ, చివరి టీ20 డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
