Telangana: అదిగో తోక.. ఇదిగో పులి.. నమ్మండి.! సాక్ష్యం ఈ ఫోటోనే.. సీన్ కట్ చేస్తే
మూడున్నరేళ్ల వయసున్న పులిగా గుర్తించిన అటవిశాఖ అదికారులు సమీప ప్రాంత ప్రజలను, సింగరేణి కార్మికుల ను అలర్ట్ చేశారు. అయితే పులి అదే రాత్రి రాష్ట్ర రహదారి దాటి.. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గుండా గోదావరి వైపు ప్రయాణం సాగించినట్టుగా గుర్తించిన అటవిశాఖ అదికారులు.. 21 ట్రాప్ కెమెరాల సాయంతో పులి కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టుగానే మారుతుంది ఆ జిల్లాలో పరిస్థితి. అభయారణ్యాలను వీడిన పులి గ్రామ సరిహద్దుల్లో సంచరిస్తూ ఉండడంతో ఇప్పుడు ఆ పులి సంచారాన్ని తమ ఆకతాయి పనులకు ఆయుధంగా మార్చుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. సోషల్ మీడియాలో ఏఐ జనరేటర్ ఫోటోలు సర్కులేట్ చేస్తున్నారు. ఆ సమాచారం నిజమే అనుకుని భయాందోళన గురవుతున్నారు స్థానిక జనం. ఈ ఘటన మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతంలో చోటుచేసుకుంది అసలు విషయంలోకి వెళ్తే గత వారం రోజులుగా సింగరేణి ఓపెన్ కాస్ట్లు గని సమీప అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి సంచరిస్తుంది ఈనెల 11న మందమరి మండలం నుండి ఆర్కే ఫై న్యూ టెక్ కాలనీ ఆర్కే ఎయిట్ మీదుగా శ్రీరాంపూర్ సీఎం కార్యాలయం సమీపంలో సంచరిస్తూ స్థానికుల కంటపడింది రహదారిపై వెళ్తున్న ఓ వాహనదారుడు పులి వీడియోలను చిత్రీకరించి అటవీ శాఖకు సమాచారం ఇవ్వడంతో అలర్ట్ అయిన అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి పులి పాదముద్రలు సేకరించారు. మూడున్నరేళ్ల వయసున్న పులిగా గుర్తించిన అటవిశాఖ అదికారులు సమీప ప్రాంత ప్రజలను, సింగరేణి కార్మికుల ను అలర్ట్ చేశారు. అయితే పులి అదే రాత్రి రాష్ట్ర రహదారి దాటి.. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గుండా గోదావరి వైపు ప్రయాణం సాగించినట్టుగా గుర్తించిన అటవిశాఖ అదికారులు.. 21 ట్రాప్ కెమెరాల సాయంతో పులి కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. నేరుగా రంగంలోకి దిగిన మంచిర్యాల డిఎప్వో శివ్ ఆశిష్ సింగ్ పులి ని ట్రాక్ చేశారు. ఈ నెల 13 న ఆ పులి గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిందని తెలుసుకున్నారు. అయితే రెండు రోజుల అనంతరం మరొసారి పులి సంచార సమాచారం అందుకున్న అటవిశాఖ హుటాహుటిన రంగంలోకి దిగింది. అయితే ఎలాంటి పాదముద్రలు లభించక పోవడం తో ట్రాప్ కెమెరాలను అమర్చింది.
అయితే ఇదే అదునుగా భావించిన కొందరు ఆకతాయిలు.. స్థానికుల భయాందోళనలను మరింత పెంచేలా వ్యవహరించారు. నస్పూర్ పట్టణంలోకి పులి ఎంట్రీ ఇచ్చిందని.. నేనే కళ్లారా చూశానంటూ కారులో నుండి పులి ఫోటో ను తీశానంటూ ఓ ఫోటోను కుటుంబ సభ్యులకు చేరవేశాడు. ఆ పోటో కాస్త వైరల్ గా మారి జిల్లా వాట్సాప్ గ్రూప్ లను షేక్ చేయడంతో అటవిశాఖ మరొసారి రంగంలోకి దిగింది. పులి సంచరించినట్టుగా ప్రచారం జరిగిన నస్పూర్ సిసిసి పోస్ట్ ఆఫీస్ సమీపంలో క్షుణ్ణంగా పరిశీలించిన అటవిశాఖ ఎలాంటి ఆదారాలు లభించకపోవడంతో ఆ ఫోటో వైరల్ పై పోలీసుల సహకారం కోరింది. చివరకు ఫోటో ఫేక్ అని తేలడంతో నిందితుడిని గుర్తించి ప్రజల ముందు పెట్టింది అటవిశాఖ. ఇదిగో తోక అంటే అదిగో పులి అనేలా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన వ్యక్తిని అదుపులోని తీసుకుంది. నిందితుడు నస్పూర్ కు చెందిన సాయికిరణ్ గా గుర్తించిన అటవిశాఖ అరెస్ట్ చేసింది. అయితే నిందితుడు మాత్రం తాను సరదకోసమే చేశానని.. కుటుంబ సభ్యులను అప్రమత్తం చేయాలనే ఉద్దేశ్యంతో ఏఐ సహాయంతో ఫేక్ ఫోటో క్రియేట్ చేశానని అటవిశాఖ అదికారుల ముందు వాస్తవాలను ఒప్పుకున్నాడు. దీంతో నస్పూర్ లో పులి ప్రచారానికి తెర పడింది. అయితే సింగరేణి ప్రాంతంలో పులి సంచారం ఉందని.. ఓపెన్ కాస్ట్ గనుల వద్ద పని చేసే సింగరేణి కార్మికులు అప్రమత్తంగా ఉండాలని.. పట్టణ ప్రజలు అనవసర భయాందోళనలు పెట్టుకోవద్దని సూచించారు మంచిర్యాల డిఎప్వో ఆశిష్ సింగ్. అటవిశాఖ చెప్పేంత వరకు పులి సంచార విషయంలో ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని.. పులి ఉందంటూ సోషల్ మీడియాలోప్రచారం జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరింది అటవీశాఖ.




