అనుపమ పరమేశ్వరన్, జెనీలియా, రకుల్ ప్రీత్ సింగ్‌ల తర్వాత శ్రీలీల కూడా ఏఐ సాంకేతికత దుర్వినియోగం, డీప్ ఫేక్ వీడియోల వల్ల ఎదురైన ఇబ్బందులపై స్పందించారు. ఈ తరహా కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని, మంచి కోసం టెక్నాలజీని ఉపయోగించాలని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.