శీతాకాలంలో పెరుగు తినడానికి సరైన సమయం ఏది..? పెద్ద కథే ఉందిగా..
పెరుగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కానీ సరైన సమయంలో పెరుగును తీసుకోవడం ముఖ్యం. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్లు B6 మరియు B12 ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తాయి. అందుకే.. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పెరుగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కానీ సరైన సమయంలో పెరుగును తీసుకోవడం ముఖ్యం. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్లు B6 మరియు B12 ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తాయి. అందుకే.. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రోబయోటిక్స్, కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ, ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, కానీ సైనస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
రోజంతా పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. పెరుగు చల్లదనాన్ని కలిగిస్తుంది.. రాత్రిపూట దీనిని తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమంటున్నారు ఆయుర్వేద నిపుణులు..
పెరుగు తినడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. అందువల్ల, రోజంతా దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు అన్నం తినడం వల్ల మెదడు వాపు తగ్గుతుంది. నిరాశ నుండి ఉపశమనం లభిస్తుంది. పెరుగులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడే పెరుగును శీతాకాలంలో తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. శీతాకాలంలో ఉదయం వేళ, రాత్రి పెరుగు తినకూడదంటున్నారు. ఈ సీజన్‌లో మధ్యాహ్నం తినడం మంచిది. కానీ తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు.
అయితే.. ఆరోగ్య నిపుణులు మాత్రం పెరుగును ఎప్పుడైనా తీసుకోవచ్చని.. పేర్కొంటున్నారు. ఏమైనా సమస్యలుంటే.. ముందుగా వైద్య నిపుణులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




