- Telugu News Photo Gallery Astro Tips for sleeping: Things to avoid before bed for better sleep to women
అమ్మాయిలూ.. రాత్రిళ్లు ఇలా నిద్రపోయే అలవాటు మీకూ ఉందా? వెంటనే మానేయండి..
అమ్మాయిలు తెలిసో తెలియకో చేసే కొన్ని పొరబాట్లు లేనిపోని చిక్కుల్లో పడేస్తాయి. ముఖ్యంగా రాత్రి పూట నిద్రకు ముందు కొన్ని పనులు అస్సలు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం, గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, బట్టలు కుట్టడం వంటి అనేక విషయాలు అమ్మాయిలు అస్సలు చేయకూడదట..
Updated on: Dec 19, 2025 | 6:17 AM

అమ్మాయిలు తెలిసో తెలియకో చేసే కొన్ని పొరబాట్లు లేనిపోని చిక్కుల్లో పడేస్తాయి. ముఖ్యంగా రాత్రి పూట నిద్రకు ముందు కొన్ని పనులు అస్సలు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం, గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, బట్టలు కుట్టడం వంటి అనేక విషయాలు అమ్మాయిలు అస్సలు చేయకూడదట.

ఈ నియమాలు పురుషులు, మహిళలు ఇద్దరికీ వర్తిస్తాయి. అయితే మహిళలు ముఖ్యంగా పడుకునే ముందు దూరంగా ఉండవలసిన కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి. మహిళలు రాత్రిపూట జుట్టు వదులుగా వదిలేసి పడుకోకూడదు. ముఖ్యంగా మీరు ఒంటరిగా నిద్రపోతుంటే ఇలా చేయడం మానుకోవాలి. ఇది ప్రతికూల శక్తిని, చెడు శక్తులను ఆకర్షిస్తుందని నమ్మకం. మీరు మీ భర్తతో లేదా సోదరితో పడుకుంటే మాత్రం మీ జుట్టును వదులుగా ఉంచుకోవచ్చు. ఒంటరిగా ఉన్నపుడు ఇలా చేయకూడదు.

పెర్ఫ్యూమ్ వేసుకుని నిద్రపోవడం.. మహిళలు రాత్రిపూట బయటకు వెళ్లడం లేదా పెర్ఫ్యూమ్ వేసుకుని నిద్రపోవడం మానుకోవాలి. పెర్ఫ్యూమ్ వాసన కూడా ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. కాబట్టి రాత్రిపూట పెర్ఫ్యూమ్ చల్లుకోవడాన్ని నివారించాలి.

జుట్టు దువ్వుకోవడం.. చాలా మంది మహిళలు పడుకునే ముందు జుట్టు దువ్వుకుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మహిళలు జుట్టు దువ్వకూడదు. ఇది లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుందట.

వాదనలకు దూరంగా ఉండాలి - స్త్రీలు రాత్రిపూట గొడవలు లేదా వాదించకూడదు. నిజానికి సాయంత్రం తర్వాత ఇలా చేయకూడదు. రాత్రిపూట వాదించడం వల్ల నిద్రపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా ఇంట్లో మానసిక అశాంతి, ప్రతికూల శక్తి పెరుగుతుంది.




