- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Telugu Fame Actress Jyothi Labala Birthday Celebrations Photos Go Viral
Bigg Boss Jyothi: బిగ్‌బాస్ జ్యోతి బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన టాలీవుడ్ ప్రముఖులు.. ఫొటోస్
టాలీవుడ్ ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి తాజాగ తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ బర్త్ డే వేడుకలో ఆమె స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టంట వైరల్ గా మారాయి.
Updated on: Dec 18, 2025 | 10:23 PM

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది జ్యోతి. ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కే పరిమితమైనా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది

'పెళ్లాం ఊరెళితే', ‘ఎవడిగోలవాడిది’, ‘గుడుంబా శంకర్’, ‘మహాత్మ’, ‘దరువు’, ‘రంగ ది దొంగ’, ‘కెవ్వు కేక’ తదితర సినిమాల్లో జ్యోతి నటననకు మంచి మార్కులు పడ్డాయి.

సినిమాలతో పాటు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో పాల్గొనడం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది జ్యోతి.

బిగ్‌బాస్ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన జ్యోతి, క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. 2020 తర్వాత ఆమె ఏ సినిమాలోనూ కనిపించలేదు.

తాజాగా జ్యోతి బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఆమె స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు బుల్లితెర ప్రముఖులు ఈవేడుకలో సందడి చేశారు.

ప్రస్తుతం జ్యోతి పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.



