బరువు తగ్గొచ్చని.. వీటిని ఎడాపెడా తినే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా
నేటి కాలంలో చాలా మంది అధికా బరువుతో తిప్పలు పడుతున్నారు. దీంతో బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్ని విషయాల గురించి పెద్దగా తెలియకుండానే వాటిని మన ఆహారంలో అధిక మొత్తంలో చేర్చుకుంటుంటాం. ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
Updated on: Dec 19, 2025 | 9:38 AM

నేటి కాలంలో చాలా మంది అధికా బరువుతో తిప్పలు పడుతున్నారు. దీంతో బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్ని విషయాల గురించి పెద్దగా తెలియకుండానే వాటిని మన ఆహారంలో అధిక మొత్తంలో చేర్చుకుంటుంటాం. ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బరువు తగ్గడంలో ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో చియా గింజలు ముందు వరుసలో ఉంటాయి. చియా గింజల ఆరోగ్య ప్రయోజనాల కారణంగా చాలా మంది వీటిని విస్తృతంగా వినియోగిస్తుంటారు.

చియా గింజల్లో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్నందున వాటిని సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. అయితే చియా విత్తనాలను అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

చియా గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. పరిమిత పరిమాణంలో తీసుకుంటే అవి జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అదే అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగించి జీర్ణ సమస్యలు వస్తాయి.

రోజులో తీసుకునే అన్ని ఆహారాల్లో చియా విత్తనాలను చేర్చుకుంటే ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొవల్సి ఉంటుంది.




