రుచి కోసం చేపలు దీనితో కలిపి తిన్నారో.. మీ కథ కంచికే!
18 December 2025
TV9 Telugu
TV9 Telugu
చేపలు లీన్ ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌కు మూలం. అయితే చేపలను కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోకూడదు. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు
TV9 Telugu
మరికొన్ని సందర్భాల్లో కడుపు ఉబ్బరం, అజీర్తి, వికారం, డయేరియా వంటి సమస్యలకు దారితీస్తాయి. సీఫుడ్ లేదా చేపలతో కలిపి లేదా తిన్న తర్వాత ఏఏ ఆహార పదార్థాలను తీసుకోకూడదో తెలుసుకుందాం..
TV9 Telugu
పాలు, పెరుగు వంటి ఇతర పాల ఉత్పత్తులను చేపలతో కలిపి తినడం వల్ల జీర్ణ అసౌకర్యం, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు చర్మ అలెర్జీలు, ఇన్‌ఫెక్షన్లు కూడా ఏర్పడవచ్చు
TV9 Telugu
పాల ఉత్పత్తులు, చేపల్లో ఉండే అధిక ప్రొటీన్లు, ఇతర సమ్మేళనాలు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. చేపలు, నిమ్మజాతి పండ్లు కలిపి తినడం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి
TV9 Telugu
కొందరు నిమ్మలోని ఆమ్లం చేపల ప్రొటీన్‌తో కలివడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బాగా ప్రాసెస్ చేసిన లేదా వేయించిన ఆహార పదార్థాలను చేపలతో కలిపి తీసుకోవడం వల్ల కూడా అనారోగ్యానికి దారి తీయవచ్చు
TV9 Telugu
వేయించిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్‌లు గుండె ఆరోగ్యానికి హానికరం. చేపలను బంగాళాదుంపలు, పాస్తా వంటి పిండి పదార్థాలు అధికంగా ఉండే వంటకాలతో కలపడం మానుకోవాలి
TV9 Telugu
ఇలా చేయడం వల్ల అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లు శరీరంలో చేరి జీర్ణ వ్యవస్థ మందగించే అవకాశం ఉంది. కారంగా ఉండే ఆహారాలు చేపల రుచిని చెడగొట్టడమే కాకుండా గ్యాస్ట్రోఇంటెస్టినల్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి
TV9 Telugu
బీన్స్, పప్పులను చేపలతో కలిపి తింటే అజీర్తి, కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చేపలతో పాటు కాఫీ తాగడం వల్ల చేపల్లో ఉండే పాదరసం (మెర్క్యూరీ) శరీరానికి అందదు