AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalvakuntla Kavitha: రామ్‌ చరణ్ గొప్ప వ్యక్తే కానీ..నా ఫేవరెట్ మాత్రం ఆ హీరోనే! వైరల్ అవుతున్న కవిత కామెంట్స్

Kalvakuntla Kavitha: రామ్‌ చరణ్ గొప్ప వ్యక్తే కానీ..నా ఫేవరెట్ మాత్రం ఆ హీరోనే! వైరల్ అవుతున్న కవిత కామెంట్స్

Phani CH
|

Updated on: Dec 18, 2025 | 2:05 PM

Share

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రామ్ చరణ్, చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. చిరంజీవి తన అభిమాన నటుడని కవిత స్పష్టం చేశారు. ఈ క్రమంలో, రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' (బుచ్చిబాబు సానా దర్శకత్వంలో) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడూ అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. అలాగే తీరిక దొరికనప్పుడు సరదాగా నెటిజన్లతో ముచ్చటిస్తుంటారు. వారు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలిస్తుంటారు. అలా డిసెంబర్ 15న కూడా ఎక్స్ వేదికగా వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు కవిత. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. చాలా మంది నెటిజన్లు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలనే అడగ్గా.. ఒక నెటిజన్ మాత్రం డిఫరెంట్ గా రామ్ చరణ్ గురించి అడిగాడు. మెగా పవర్ స్టార్ గురించి ఒక్క మాటలో ఏం చెబుతారు? అని కవితను అడిగాడు. ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. ‘రామ్ చరణ్ మంచి వ్యక్తి. గొప్ప డాన్సర్ కూడా.. అయితే.. నేను మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. అందుకే రామ్ చరణ్ కంటే చిరంజీవి అంటేనే ఎక్కువ ఇష్టం’ అని చెప్పుకొచ్చారు కవిత. ప్రస్తుతం కవిత చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ పేజీల్లో తెగ తిరుగుతున్నాయి. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, జగపతి బాబు, కమెడియన్ సత్య కీ రోల్స్ పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకట సతీశ్‌ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చికిరి సాంగ్ యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: మరోసారి గొంతు సవరించుకుంటున్న బాలయ్య.. ఫ్యాన్స్ గెట్ రెడీ

Jailer 2: జైలర్ 2లో ఆ ముద్దుగుమ్మతో స్పెషల్ సాంగ్‌.. దుమ్ము దుమారమే

చిరంజీవి వల్ల కాలేదు.. పోనీ.. బాలయ్య చేశాడా? అదీ లేదు

Rakul Preet: ప్లాస్టిక్ సర్జరీ బాడీ అంటూ ట్రోల్స్.. సీరియస్ అయిన రకుల్

Rashmika Mandanna: దోస్తులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రష్మిక.. ఫోటోలు వైరల్

Published on: Dec 18, 2025 01:28 PM