AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Tourism: వీకెండ్ ట్రిప్స్‌ ప్లాన్ చేస్తున్నారా?.. హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..

వారాంతాల్లో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, రెండు నుంచి మూడు గంటల ప్రయాణంలోనే చేరుకునే పర్యాటక ప్రాంతాలను గుర్తించే దిశగా తెలంగాణ టూరిజం అభివృద్ధి సంస్థ సరికొత్త ప్రణాళికను అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పెద్దగా వెలుగులోకి రాని 100 ప్రదేశాలను ‘వీకెండ్ డెస్టినేషన్లు’గా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

Telangana Tourism: వీకెండ్ ట్రిప్స్‌ ప్లాన్ చేస్తున్నారా?.. హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
Telangana Weekend Destinations
Prabhakar M
| Edited By: |

Updated on: Dec 18, 2025 | 10:57 AM

Share

హైదరాబాద్ నుంచి 50 నుంచి 200 కిలోమీటర్ల పరిధిలో పచ్చని కొండలు, అరణ్యాలు, జలాశయాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు అనేకం ఉన్నా.. సరైన ప్రచారం, సమగ్ర సమాచారం లేకపోవడంతో ఎక్కువ మంది పొరుగు రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతున్నారని టూరిజం అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ‘హైపర్ లోకల్ టూరిజం’పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

వీకెండ్ ట్రిప్స్‌పై ఆసక్తి ఉన్నవారు హైదరాబాద్‌లోనే దాదాపు 10 లక్షల మంది ఉంటారని అంచనా. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, పరిశ్రమల్లో పనిచేసేవారు తమ స్నేహితులు, కుటుంబాలతో కలిసి ఒకట్రెండు రోజులు ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ ప్రణాళికను రూపొందించారు. శని, ఆదివారాలు లేదా ఇతర సెలవు రోజుల్లో సులభంగా వెళ్లివచ్చే ప్రాంతాలనే ఈ జాబితాలో చేర్చుతున్నారు.

క్రౌడ్ సోర్సింగ్ విధానంలో పర్యాటక ప్రాంతాల వివరాలను సేకరిస్తూ.. ఆయా ప్రదేశాలకు రోడ్డు కనెక్టివిటీ, సమీప వసతి సదుపాయాలు, అడ్వెంచర్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్, స్థానిక వంటకాల ప్రత్యేకతలతో కూడిన పూర్తి సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తేనున్నారు. ఇది పర్యాటకులకు ప్రయాణ ప్రణాళికను సులభతరం చేయనుంది.

ఇప్పటికే అనంతగిరి కొండలు, రంగనాయకసాగర్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, రామప్ప దేవాలయం, కుంటాల–పొచ్చెర జలపాతాలు, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట, చార్మినార్, యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్, బాసర ఆలయం, వరంగల్ ఖిలా, బుద్ధవనం, సోమశిల, జోగులాంబ శక్తిపీఠం, వనపర్తి జిల్లా శ్రీరంగనాయకస్వామి ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలు ‘100 వీకెండ్ డెస్టినేషన్లు’ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

కాబట్టి రాష్ట్రంలోనే మరిన్ని అద్భుత ప్రాంతాలను టూరిస్ట్‌ స్పాట్‌గా మార్చి.. రాష్ట్రంలోనే పర్యాటకాన్ని విస్తరించడమే ఈ ప్రయత్నం ఉద్దేశమని టూరిజం కార్పొరేషన్ ఎండీ వల్లూరి క్రాంతి తెలిపారు. రెండు, మూడు గంటల్లో చేరుకునే గమ్యస్థానాలను గుర్తించి, వాటికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా జిల్లాలకూ పర్యాటకుల రాక పెంచాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?