AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓవైపు చలి.. మరోవైపు పొగమంచుతో ప్రజల ఇక్కట్లు

ఓవైపు చలి.. మరోవైపు పొగమంచుతో ప్రజల ఇక్కట్లు

Phani CH
|

Updated on: Jan 07, 2026 | 6:28 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కాస్త తగ్గినా, పొగమంచు కొనసాగుతోంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ కాగా, ఉత్తరాది రాష్ట్రాలు దట్టమైన పొగమంచు, తీవ్ర చలితో వణికిపోతున్నాయి. ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పొగమంచు కారణంగా విమాన, రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరుగుతోంది. వాతావరణశాఖ వివరాలు ప్రకారం.. తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడనుంది. పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు డబుల్ డిజిట్‌కు చేరుకున్నాయి. చలి తీవ్రత కూడా తగ్గుముఖం పట్టింది. రాగల 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా.. కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం, రాత్రి సమయంలో పొగ మంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు ఏపీలో దిగువ ట్రోపో ఆవరణంలో కోస్తాంధ్రా, యానాం, రాయలసీమలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. రాగల రెండు, మూడు రోజులు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ , యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అక్కడక్కడ పొగమంచు కురిసే ఛాన్స్ ఉంది. దక్షిణ, ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడిందని, 24 గంటల్లో అది మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 9వ తేదీ నుంచి వర్షాలు పడే ఆస్కారముందని పేర్కొంది. మరోవైపు కోస్తా జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. మరో నాలుగు రోజులు అల్లూరి, పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు దట్టంగా, మిగతా జిల్లాల్లో మోస్తరుగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నెల్లూరులో 21.6 డిగ్రీలుగా.. విజయనగరంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు, అనంతపురం, కర్నూలు, కడప, శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, తిరుపతి, నెల్లూరులో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో పాటు..పొగమంచుతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. విజయనగరం జిల్లాలో దట్టంగా కురుస్తున్న మంచుతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే తటపటాయిస్తున్నారు. రహదారి కనిపించక వాహనదారులు నెమ్మదిగా వెళుతున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. మరోవైపు మంచు సోయగాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు కమ్ముకుంది. దీంతో ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. పొగమంచు అలుముకోవడంతో విజిబులిటి తగ్గింది. పొగమంచు ప్రభావంతో విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్ పోర్టు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తుంది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌లో మంచు కురుస్తోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్..యూపీ, బిహార్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఢిల్లీలో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పంజాబ్‌, యూపీ, హర్యానా, ఢిల్లీ, బిహార్‌..అసోం, త్రిపుర, మణిపూర్‌పై పొగమంచు ప్రభావం ఉంది. విమానాలు, రైళ్ల రాకపోకలపై పొగమంచు ప్రభావం పడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: బంగారం ఇక కొనలేమా.. 24 క్యారెట్ల పసిడి ధర ఎంతంటే

ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!

ATMలలో రూ. 500 ఆపేస్తున్నారా ?? మార్చి 2026 డెడ్‌లైన్‌పై కేంద్రం క్లారిటీ

ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా.. వైరల్‌గా డాక్టర్‌ పోస్ట్‌

బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్‌