ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా.. వైరల్‌గా డాక్టర్ పోస్ట్
హైదరాబాద్‌లోని ఓ సీనియర్ కార్డియాలజిస్ట్ కొత్త ఏడాది రోజు తన కుమార్తెతో లంచ్ మిస్ చేసుకుని, తీవ్ర గుండెపోటుతో బాధపడుతున్న వ్యక్తికి యాంజియోప్లాస్టీ చేసి ప్రాణాలు కాపాడారు. ఈ త్యాగాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా, అది వైరల్ అయింది. పేషెంట్ కుమార్తెకు తండ్రిని తిరిగివ్వడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వైద్యుల అంకితభావాన్ని ఈ ఘటన చాటిచెప్పింది.
కొత్త ఏడాది తమ కుటుంబంతో ఆనందంగా గడపాలని ప్రతిఒక్కరూ అనుకుంటారు. కానీ ఈ కొత్త సంవత్సరాన్ని తన కుమార్తెతో కలిసి గడపాలనుకున్న ఓ కార్డియాలజిస్ట్ మాత్రం మరో చిన్నారికి తండ్రి ప్రేమను అందించడానికి తన కుమార్తెకు ఇచ్చిన మాట తప్పినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. జనవరి ఫస్ట్ నాడు తనతో కలిసి లంచ్ చేయాలని కుమార్తె కోరినట్లు హైదరాబాద్‌కు చెందిన ఓ సీనియర్ కార్డియాలజిస్టు సోషల్ మీడియాలో తెలిపారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు లంచ్‌కు వస్తానని తన కుమార్తెకు ప్రామిస్ చేసినట్లు రాసుకొచ్చారు. అయితే అదే రోజు మధ్యాహ్నం 1.30 సమయంలో ఓ వ్యక్తి తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రికి రావడంతో యాంజియోప్లాస్టీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో తన కుమార్తెతో లంచ్ మిస్సయినట్లు తెలిపారు. ఓ ప్రాణం కాపాడేందుకు.. తమ కుమార్తెకు ఇచ్చిన మాట తప్పానన్నారు. కుమార్తెతో లంచ్ చేయలేకపోయినప్పటికీ తన పేషెంట్ ప్రాణాలను కాపాడి అతడి చిన్నారికి తండ్రిని తిరిగివ్వగలిగానని సంతృప్తిని తెలిపారు. ఇకపై అతడి కుమార్తె జీవితంలోని అన్ని ముఖ్యమైన క్షణాలను తన తండ్రితో కలిసి ఆనందంగా గడుపుతుందన్నారు. ఈ పోస్టు 16 గంటల్లో 2 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ప్రజల ప్రాణాలు కాపాడడానికి పగలు, రాత్రి తేడా లేకుండా వైద్యులు చేసే కృషిని ప్రశంసించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
చట్నీలో బల్లి.. తిన్న 8 మందికి వాంతులు, విరేచనాలు
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా ?? ఇంద్రకీలాద్రిపై మారిన రూల్స్ తెలుసుకోండి
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

