సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాక సర్పంచ్ దంపతులు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు తమ సొంత నిధుల నుండి రూ.5,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఈ అకౌంట్లు తెరిపించి, ఆడపిల్లల చదువు, వివాహం భారం కాకుండా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఈ గొప్ప కార్యక్రమం జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
ఇటీవల తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బరిలో దిగిన అభ్యర్ధులు గెలుపే లక్ష్యంగా గ్రామ ప్రజలకు వివిధ హామీలు ఇచ్చారు. కోతులను తరిమి కొడతామని కొందరు, ఆడపిల్ల పుడితే రూ.5000 పిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని మరో అభ్యర్ధి హామీ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారి మాటను నిలబెట్టుకుంటున్నారు. తాజగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక సర్పంచ్ వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, మానవీయ కోణంలో ఆలోచించిన సర్పంచ్ దంపతులు.. తన ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామంలో ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుట్టినా తమ సొంత నిధుల నుండి రూ.5,000 ఆ పుట్టిన బిడ్డకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం ద్వారా ఈ అకౌంట్లను తెరిపించి, ఆ పాస్ బుక్కులను తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్, గ్రామానికి చెందిన తిరుమలేష్-గౌతమి దంపతులకు పుట్టిన ఆడబిడ్డ పేరు మీద రూ. 5,000 డిపాజిట్ చేసి, ఆ పాస్ బుక్కును స్వయంగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ .. ఆడపిల్లల చదువు, వివాహం తల్లిదండ్రులకు భారం కాకూడదు. ఈరోజు మేము చేసే ఈ చిన్న పొదుపు, ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యే సరికి ఆ బిడ్డకు అండగా మారుతుంది. గ్రామస్తుల ఆలోచనా విధానంలో మార్పు తేవడమే తమ లక్ష్యం అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడమే కాకుండా, వ్యక్తిగతంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్న మంజుల సుధాకర్ దంపతులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జిల్లాలోని ఇతర గ్రామాలకు కూడా ఈ నిర్ణయం ఒక దిక్సూచిగా నిలుస్తుందని స్థానికులు కొనియాడుతున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిన సర్పంచ్ దంపతుల చొరవ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TTD: ఇకపై శ్రీవారి భక్తుల చెంతకే జల ప్రసాదం..
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
విజయ్ సినిమాకు సెన్సార్ చిక్కులు కోర్టుకెక్కిన హీరో
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

