విజయ్ సినిమాకు సెన్సార్ చిక్కులు కోర్టుకెక్కిన హీరో
విజయ్ దళపతి చివరి చిత్రం 'జన నాయగణ్' సెన్సార్ సమస్యలతో విడుదలకు ఆలస్యమవుతోంది. సెన్సార్ బోర్డు తీరుపై చిత్ర బృందం చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. కట్స్ చేసినా సర్టిఫికెట్ ఇవ్వకపోవడం, రివైజింగ్ కమిటీకి పంపడంపై నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 9న సినిమా రిలీజ్ సాధ్యమా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.
విజయ్ దళపతి చివరి సినిమా ‘జన నాయగణ్’ జనవరి 9 న రిలీజ్ కానుంది. ఈక్రమంలోనే సెన్సార్ బోర్డ్ నుంచి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో.. ఈ మూవీ టీం సెన్సార్ బోర్డ్ తీరుపై చెన్నై హైకోర్ట్ మెట్లెక్కింది. టీం చెబుతున్న ప్రకారం.. దాదాపు 2 వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీ చూసి.. 3 రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్‌కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేసినా.. సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేదని జననాయగన్ నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. అంతేకాదు ఇది జరిగిన 9 రోజులకు అంటే జనవరి 05న.. సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్‌ని సంప్రదించాలని సెన్సార్ బోర్డ్ చెప్పడంపై జననాయగన్ టీం కాస్త అసహనం వ్యక్తం చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో కేసు వేసింది. త్వరగా ఇది ఇప్పించాలని పిటిషన్‌లో పేర్కొంది. అయితే సెన్సార్ ఫార్మాలిటీస్ అంతా పూర్తయినా సరే ఇలా జరగడం వెనక ఎవరున్నారు? చెప్పిన తేదీకి విజయ్ సినిమా రిలీజ్ అవుతుందా లేదా? రాజకీయ కారణాలతోనే విజయ్ సినిమాను ఇబ్బంది పెడుతున్నారా? ఏంటి అని విజయ్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. తమ హీరో సినిమాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: ఆస్కార్‌కు అడుగు దూరంలో జాన్వీ మూవీ
The Raja Saab: క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్.. మామూలుగా ఉండదు
ఓవైపు జైల్లో భర్త.. మరోవైపు వేధింపులు.. దారుణంగా దర్శన్ భార్య పరిస్థితి
Thalapathy Vijay: బాలయ్య దెబ్బకు.. షాక్‌లోకి విజయ్ !! ట్రెండింగ్‌లో నటసింహం
Jabardasth Naresh: జబర్దస్త్ నరేష్ పెళ్లి పేరుతో ప్రచారం.. మళ్ళీ మొదటికొచ్చిన ప్రయత్నాలు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

