Jabardasth Naresh: జబర్దస్త్ నరేష్ పెళ్లి పేరుతో ప్రచారం.. మళ్ళీ మొదటికొచ్చిన ప్రయత్నాలు
జబర్దస్త్ నరేష్ తన పెళ్లి ప్రణాళికలపై స్పష్టతనిచ్చాడు. గతంలో నవ్యతో జరిగిన నిశ్చితార్థం కేవలం ఓ స్కిట్ మాత్రమేనని వెల్లడించాడు. ప్రస్తుతం తన కెరీర్, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారిస్తున్నానని, భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానని తెలిపాడు. తనకు సంతోషకరమైన కుటుంబం కావాలని, తన తల్లిదండ్రులను అర్థం చేసుకొని, కెరీర్‌ను గౌరవించే అమ్మాయిని కోరుకుంటున్నానని నరేష్ పేర్కొన్నాడు.
జీవితంలో ఎవరికైనా ఓ తోడు అవసరం. మన వెన్నంటి నడుస్తూ.. కష్టసుఖాల్లో నీడగా ఉండే జోడీ ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఈ ముఖ్యమైన పనిలో జబర్దస్త్ నరేష్.. సక్సెస్ అయ్యాడనే అందరూ అనుకున్నారు. కొన్ని నెలల క్రితం తానో అమ్మాయిని చూసుకున్నట్టు.. పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పడంతో.. అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. ఓ షో వేదికగా జరిగిన ఎంగేజ్‌మెంట్ స్కిట్‌లో ఆమెను పరిచయం కూడా చేశాడు. కానీ కట్ చేస్తే.. ఏమైదో ఏమో తెలీదు కానీ ఇప్పుడు మాట మార్చాడు ఈ కమెడియన్. ఆ అ మ్మాయితో తనకు సంబంధం లేదన్నట్టు.. అది జెస్ట్ స్కిట్ మాత్రమే అన్నట్టు తాజాగా చెప్పి షాకిచ్చాడు. తన మాటల కారణంగా ఈ జబర్దస్ నరేష్ పెళ్లి ప్రయత్నాలు మళ్లీ మొదటికేనా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు. గతంలో నరేష్ చెప్పిన మాటల ప్రకారం నవ్య అనే అమ్మాయితో మనోడి పెళ్లి జరుగుతుందనే అందరూ అనుకున్నారు. కానీ అది కేవలం ఒక స్కిట్ కోసమేనని, అది నిజం కాదని షాకిచ్చాడు నరేష్. తన కష్టమంతా తన కుటుంబం కోసమేనని, వారు బాగుండాలని చెప్పుకొచ్చాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే నానుడిని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని చూస్తున్నట్లు చెప్పాడు. తన కెరీర్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదనే భయం ఎప్పుడూ తనలో ఉంటుందని, అందుకే వ్యాపారం లాంటి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తన గతంలోని కష్టాలను గుర్తుచేసుకుంటూ, నరేష్ తన బాల్యం నుంచి ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లను వివరించాడు. తనకు పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలతో ఒక సంతోషకరమైన కుటుంబాన్ని పోషించాలనే కోరిక ఉందని నరేష్ చెప్పాడు. తనకి ఇంట్లో వారు సరైన సంబంధాలు చూస్తున్నారని, కట్నాల పట్ల ఆసక్తి లేదని, అమ్మాయి అడిగితే తానె కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సరదాగా అన్నాడు నరేశ్. తన కాబోయే భార్య తనకంటే కొద్దిగా ఎత్తుగా ఉండాలని, తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, అలాగే తన కెరీర్, పని తీరును అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చాడు. ఈవెంట్లకు వెళ్లినప్పుడు ఫోన్లు, వీడియో కాల్స్ ద్వారా టచ్‌లో ఉంటానని, దూరమైపోతున్నానని అనుకోకూడదు తెలిపాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈవెంట్‌లో సీనియర్ నటికి పూనకం.. వైరల్ వీడియో
మెస్సీ Vs రొనాల్డో ‘వెయ్యి గోల్స్’ మొనగాడు ఎవరు ??
గోదావరిలో పడవలతో చిరంజీవి పేరు.. ఆకట్టుకున్న దృశ్యం
Sravana Bhargavi: భాగస్వామి సపోర్ట్ లేనప్పుడు.. ఇలాగే జరుగుతుంది !!
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

