AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sravana Bhargavi: భాగస్వామి సపోర్ట్‌ లేనప్పుడు.. ఇలాగే జరుగుతుంది !!

Sravana Bhargavi: భాగస్వామి సపోర్ట్‌ లేనప్పుడు.. ఇలాగే జరుగుతుంది !!

Phani CH
|

Updated on: Jan 07, 2026 | 4:19 PM

Share

హేమ చంద్రతో విడిపోయిన తర్వాత సింగిల్ మదర్‌గా శ్రావణ భార్గవి తన జీవితం, బంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎదురయ్యే బాధ్యతలు, స్వీయ సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. భాగస్వాములు ఒకరినొకరు గౌరవించుకుంటూ, తమను తాము పోషించుకోవాలని ఆమె సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం వ్యాయామం ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు.

సింగర్ హేమ చంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రావణ భార్గవి.. ఇప్పుడు తన బిడ్డతో సింగిల్‌గానే ఉంటున్నారు. హేమ చంద్రతో విడాకుల గురించి నేరుగా బయట కానీ.. అటు సోషల్ మీడియాలో కానీ ప్రస్తావించని ఈమె.. ఇప్పుడు మాత్రం ఇన్‌డైరెక్ట్‌గా.. ఓ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. బంధాలు.. భాగస్వాములు ఎలా ఉండాలనేది చెప్పుకొచ్చారు. బంధాల విషయంలో, భాగస్వాములు ఒకరికొకరు ప్రత్యేక స్థానాన్ని కల్పించుకోవడం ద్వారా జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని శ్రావణ భార్గవి అన్నారు. అలాగే ‘యువర్ ఫెమినైన్ ఎనర్జీ, యువర్ మాస్కులిన్ ఎనర్జీ’ థియరీని ప్రస్తావిస్తూ… భాగస్వామి మద్దతు ఇస్తే ఎన్ని పనులనైనా చేసినా ఒత్తిడిదనే ఉండదంటూ చెప్పుకొచ్చారు. ఒంటరిగా ఉన్నవారు తమను తాము పోషించుకుంటూనే.. తమ పై ఉన్న బాధ్యతలను నెరవేర్చుకోవాలన్నారు శ్రావణ భార్గవి. అంతేకాదు ఒంటరిగా ఉన్నవారికి కూడా తన స్వా అనుభవంతో.. ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు శ్రావణ భార్గవి. ఒంటరిగా ఉన్నప్పుడు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సందర్భాలలో “మ్యాన్ అండ్ వుమెన్” రెండు పాత్రలనూ ఒక్కరే పోషించాల్సి వస్తుందన్నారు ఈమె. అటువంటి పరిస్థితుల్లో తమను తాము పోషించుకోవడం, తమ వాళ్లను రక్షించుకోవడం ముఖ్యమన్నారు శ్రావణ భార్గవి. ‘ఎంప్టీ ట్యాంక్’ నుంచి ఎవరూ ఏమీ ఇవ్వలేరని, కాబట్టి తమను తాము పెంపొందించుకోవడం, పాంపర్‌ చేసుకోవడం అవసరమని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరికి వారుగా సంతోషాన్నిచ్చే పనులకు సమయం కేటాయించాలని చెప్పారు. ఆ క్రమంలోనే ఎవరూ గిల్ట్ ఫీల్ కానవసరం లేదని… ఈ విషయంలో తనకు ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేదన్నారు శ్రావణ భార్గవి. అలాగే, శారీరక, మానసిక శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిదన్నారు శ్రావణ భార్గవి. దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆమె ప్రస్తావించారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం తాను వారంలో కనీసం నాలుగు రోజులు వర్కవుట్స్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు ఈమె.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సర్కారు వారి మాట కోసం సంక్రాంతి సినిమాల వెయిటింగ్

Bala Krishna: NBK111 సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయాలు.. నిజంగా అలా ఉండబోతుందా

Allu Arjun: కెరీర్ కోసం కత్తిలాంటి ప్లానింగ్.. అల్లు అర్జున్ అంటే ఆమాత్రం ఉంటది

మేటర్ లేకుండానే.. సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు.. ఏంటి బాస్ ఇది

Pawan Kalyan: మరో సినిమా అనౌన్స్ చేసిన పవర్ స్టార్.. సర్‌ప్రైజ్ అదిరిందిగా