AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: మరో సినిమా అనౌన్స్ చేసిన పవర్ స్టార్.. సర్‌ప్రైజ్ అదిరిందిగా

Pawan Kalyan: మరో సినిమా అనౌన్స్ చేసిన పవర్ స్టార్.. సర్‌ప్రైజ్ అదిరిందిగా

Phani CH
|

Updated on: Jan 07, 2026 | 3:51 PM

Share

ఓజీ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా కొత్త ప్రాజెక్ట్‌లు ప్రకటిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. సురేందర్ రెడ్డి సినిమా ఖాయం కాగా, సుజీత్‌తో ఓజీ సీక్వెల్, ప్రీక్వెల్ కూడా చర్చలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన మార్షల్ ఆర్ట్స్ పోస్టర్ ఓజీ 2కి సంకేతం అని తెలుస్తోంది. జనవరి 7న పూర్తి వివరాలు వెలువడనున్నాయి. పవన్ నుండి ఇలాంటి అప్‌డేట్‌లు రావడం ఫ్యాన్స్‌కు పండగే.

తన పనులతో అభిమానులకు రోజుకో స్వీట్ షాక్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఓజికి ముందు అసలు సినిమాలే చేయడేమో.. ఇక ఓజి చివరి సినిమానేమో అని చాలా కంగారు పడ్డారు ఫ్యాన్స్. అలాంటిదిప్పుడు వరసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ.. అంతులేని సంతోషాన్నిస్తున్నారు. అసలు పవన్ ప్లాన్ ఏంటి..? తాజాగా విడుదలైన పోస్టర్‌కు అర్థమేంటి..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. ఏ నిమిషాన OG సినిమా విడుదలైందో తెలియదు కానీ.. అప్పట్నుంచి పవన్ కళ్యాణ్‌లో ఊహించని మార్పులు చాలానే వచ్చాయి. ఆ సినిమాకు సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదు పవర్ స్టార్. ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసి.. రాజకీయాల్లో బిజీ అవుతానన్నారు. కానీ OGకి వచ్చిన రెస్పాన్స్ చూసాక పవన్ మనసు మారింది. వరస సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. మొన్నీమధ్యే సురేందర్ రెడ్డి సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు పవర్ స్టార్. మూడేళ్ళ కింద ఓకే అయిన ప్రాజెక్ట్ అయినా కూడా.. ఉంటుందా లేదా అనే అనుమానాలు ఎక్కువగా ఉండేవి. అవన్నీ పటాపంచలు చేస్తూ ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు పవన్. పైగా కొత్త లుక్ కూడా ఈ సినిమా కోసమే అనేది కొత్తగా జరుగుతున్న ప్రచారం. సురేందర్ రెడ్డి తర్వాత మరో రెండు సినిమాలు చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఆ రెండూ సుజీత్ దర్శకత్వంలోనే ఉండే అవకాశం లేకపోలేదు. అవే ఓజి సీక్వెల్ అండ్ ప్రీక్వెల్. తాజాగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పేరుతో ఓ పోస్టర్ విడుదలైంది. అందులో కఠానా ఉంది.. OG 2కి ఇది అనౌన్స్‌మెంటే అంటున్నారు అభిమానులు. పోస్టర్‌లో కఠానాతో పాటు పవన్ కళ్యాణ్ న్యూ మార్షల్ ఆర్ట్స్ జర్నీ స్టార్ట్స్ అని రాసుంది. ఓజి సీక్వెల్ జపాన్‌తో కనెక్ట్ అవ్వడమే కాదు.. మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా సాగుతుందని ఆల్రెడీ చెప్పారు సుజీత్. ఈ పోస్టర్ చూస్తుంటే అదే కనెక్ట్ అవుతుంది. జనవరి 7న పూర్తి వివరాలు రానున్నాయి. ఏదేమైనా పవన్ నుంచి ఇలాంటి అప్‌డేట్స్ రావడం ఫ్యాన్స్‌కు మాత్రం పండగే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: ఇప్పటి వరకు నా ఫెయిల్యూర్స్ మాత్రమే చూసారు.. ఇక నుండి నా సక్సెస్ చూస్తారు

బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీస్

Dhurandhar: ఏ మాత్రం తగ్గని ధురంధర్ హవా.. ఒక్కో రికార్డులు తిరగరాస్తుందిగా

Deepika Padukone: కొత్త టాలెంట్ కోసం దీపికా ప్లానింగ్..

మూడో ప్రపంచ యుద్ధం ?? మదురోకు అండగా కిమ్.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్