AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడో ప్రపంచ యుద్ధం ?? మదురోకు అండగా కిమ్.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్

మూడో ప్రపంచ యుద్ధం ?? మదురోకు అండగా కిమ్.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్

Phani CH
|

Updated on: Jan 07, 2026 | 1:23 PM

Share

వెనిజువెలా అధ్యక్షుడు మదురో అరెస్ట్‌ను కిమ్ జోంగ్-ఉన్ తీవ్రంగా ఖండించారు. సార్వభౌమాధికారంపై అమెరికా దాడిగా అభివర్ణించారు. ఆయిల్ నిల్వల కోసమే వాషింగ్టన్ ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించారు. అమెరికా వ్యతిరేక దేశాలు ఏకమైతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెనిజువెలా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ వ్యతిరేకించారు. ఇది ఆ దేశ సార్వభౌమాధికారంపై తీవ్రమైన దాడి అన్నారు. దీంతో అమెరికా ఆధిపత్య ధోరణి మరోసారి స్పష్టమైందని ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రసారం చేసింది.వాషింగ్టన్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తోందని కిమ్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే కారణంతో తమ అణు, క్షిపణి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ఉత్తర కొరియా చెబుతోంది. అమెరికా ప్రత్యేక దళాలు వెనిజువెలా రాజధాని కారాకాస్ లో వైమానిక దాడులు చేసాయి. మదురోను అతని భార్యను అదుపులోకి తీసుకుని హెలికాప్టర్‌లో న్యూయార్క్‌కు తరలించాయి. అక్కడ మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కేసుల్లో మదురోపై ఆరోపణలు ఉన్నాయి. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే అమెరికా పై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు తెలియచేయాలని కిమ్‌ ప్రభుత్వం పిలుపునిచ్చింది. మదురో తనకు మంచి స్నేహితుడని కిమ్ ఇప్పటికే చెప్పారు. అక్కడి ఆయిల్ నిక్షేపాలపై కన్నేసిన అమెరికా వాటిని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు మాత్రమే ఇటువంటి చర్యలకు దిగిందని, దానికి డ్రగ్స్ అంటూ దొంగ నాటకాలకు తెరతీసిందన్న ఆరోపణలు చేసింది. కిమ్‌ పిలుపుతో అమెరికాను వ్యతిరేకించే దేశాలు ఒక్క చోట చేరితే ఈ పరిణామం మూడో ప్రపంచం దారి తీయవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

దేశీ స్టయిల్‌లో రోడ్డు దాటిన రష్యన్‌ మహిళలు.. నెట్టింట వీడియో ఫుల్ వైరల్

చలి కాచుకోవడానికి వచ్చిన పాముతో ముచ్చట్లు పెట్టిన వ్యక్తి.. మీరు ఇలా ఉన్నారేంట్రా

మీ జుట్టు రాలుతుందా ?? ఈ నేచురల్‌ హెయిర్‌ మాస్క్‌ ట్రై చేయండి.. ఒక్క వెంట్రుక కూడా రాలదు