చలి కాచుకోవడానికి వచ్చిన పాముతో ముచ్చట్లు పెట్టిన వ్యక్తి.. మీరు ఇలా ఉన్నారేంట్రా
మధ్య ప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్ యువకుడు చలి మంట వద్ద నాగు పాముతో మాట్లాడిన వైరల్ వీడియో సంచలనం సృష్టిస్తోంది. స్నేహితులు పారిపోయినా, యువకుడు మాత్రం ధైర్యంగా పాముకు చలి కాచుకోమని చెప్పాడు. పాము కూడా అతడి మాటలు విన్నట్లు తలూపి, ఎవరికీ హాని చేయకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆ యువకుడి సాహసాన్ని ప్రశంసిస్తున్నారు, కొందరు పాములకు కూడా చలి ఉంటుందని చెబుతున్నారు.
మధ్య ప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు ఉదయం పూట చలికి తట్టుకోలేక స్నేహితులతో కలిసి చలి మంట వేశాడు. అందరూ దాని చుట్టూ కూర్చుని చలి కాచుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఓ నాగు పాము వచ్చింది. ఆ పామును చూసి యువకుడి స్నేహితులందరూ పరుగులు తీశారు. కానీ, ఆ యువకుడు మాత్రం అక్కడినుంచి పక్కకు కదల్లేదు. ఆ పాము చలి మంటకు కొద్దిదూరంలో ఆగిపోయింది. ఆ యువకుడు తనకు రెండు అడుగుల దూరంలో ఉన్న పాముతో మాట్లాడ్డం మొదలెట్టాడు. ‘నువ్వు నన్ను కాటు వేయకు. నీకేదైనా సమస్య ఉంటే నాకు చెప్పు. రిలాక్స్ అవ్వు. బాగా చలి కాచుకో’ అని ఓ నిమిషం పాటు దాంతో మాట్లాడాడు. ఆ పాము కూడా అతడి మాటలు వింటున్నట్లు అటు, ఇటు తలూపింది. అతడికి ఎలాంటి హానీ చేయలేదు. అతను కూడా దాన్ని ఏమీ చేయలేదు. కొద్ది సేపటి తర్వాత ఆ పాము అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. వైరల్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ యువకుడు చాలా ధైర్యవంతుడిలా ఉన్నాడు. పామును చూసి పారిపోకుండా అక్కడే కూర్చున్నాడు. నిజంగా నువ్వు చాలా గ్రేట్’..‘పాము అతడి దోస్త్‌లా ఉంది. ఏం చెప్పినా శ్రద్ధగా వింటోంది’..‘పాములకు కూడా చలిపెడుతుంది. అందుకే అది చలి కాచుకోవటానికి వచ్చింది’..‘నీ ధైర్యం తగలెయ్య.. నీ ప్రాణాలు పోతాయ్ రా ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ వ్యక్తి తన దగ్గరకు వచ్చిన నాగు పాముతో చిట్ చాట్ చేశాడు. ఆ పాము కరుస్తుందన్న భయం కొంచెం కూడా లేకుండా ఓ నిమిషం పాటు దాంతో మాట్లాడటం వింతగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ జుట్టు రాలుతుందా ?? ఈ నేచురల్ హెయిర్ మాస్క్ ట్రై చేయండి.. ఒక్క వెంట్రుక కూడా రాలదు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

