మీ జుట్టు రాలుతుందా ?? ఈ నేచురల్ హెయిర్ మాస్క్ ట్రై చేయండి.. ఒక్క వెంట్రుక కూడా రాలదు
జుట్టు రాలడం, చుండ్రు వంటి జుట్టు సమస్యలకు కలబంద ఒక అద్భుతమైన సహజసిద్ధ పరిష్కారం. నిపుణుల సూచనల మేరకు, కలబంద జెల్‌ను ఇతర పదార్థాలతో కలిపి హెయిర్ మాస్క్‌లుగా ఉపయోగించడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహించవచ్చు, జుట్టును బలంగా, ఆరోగ్యంగా మార్చవచ్చు. చుండ్రు, నిర్జీవమైన జుట్టుకు కూడా ఇది సహాయపడుతుంది.
ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రస్తుత కాలంలో అందరూ ఎదుర్కొనే సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉండొచ్చు..ముఖ్యంగా చుండ్రు, విటమిన్ల లోపం ఇలా కారణం ఏదైనా సహజసిద్దమైన వాటితో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకు కలబంద జెల్ మంచి ఆప్షన్ అంటున్నారు. జుట్టు రాలడం, చుండ్రు వంటి అనేక సమస్యలను కూడా ఇది తరమికొట్టగలదట. కలబంద హెయిర్ మాస్క్‌ను వివిధ మార్గాల్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. నిపుణుల ప్రకారం… జుట్టు రాలడం, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు ఉంటే.. ఒక కప్పు కలబంద జెల్, 2 టీస్పూన్ల ఆముదం నూనె, 2 టీస్పూన్ల మెంతి పొడి కలిపి జుట్టుకు అప్లై చేసి 2 గంటలు అలాగే ఉంచి,ఆ తర్వాత తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చుండ్రుతోపాటు, జుట్టు నిర్జీవంగా మారితే 5 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ తీసుకొని, 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల తేనె తీసుకుని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని దానిని జుట్టుకు అప్లై చేసి, అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఒక టీస్పూన్ నిమ్మరసంలో 2 టీస్పూన్ల కలబంద జెల్ కలిపి జుట్టుకు పట్టించాలి. నిమ్మకాయలోని విటమిన్ సి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే కప్పు ఉల్లిపాయ రసం, ఒక టీస్పూన్ కలబంద జెల్ కలిపి జుట్టుకు అప్లై చేస్తే ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొత్త జుట్టు కూడా పెరుగుతుంది. జుట్టు బలంగా ఉండటానికి, పోషణకు.. 2 టీస్పూన్ల జస్వంద్ పేస్ట్, 1 కప్పు కలబంద జెల్ కలిపి తలకు, జుట్టుకు అప్లై చేయాలి. 30 నుండి 60 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూ, కండిషనర్‌తో తల స్నానం చేయాలి. జుట్టు రాలడాన్ని నివారించడానికి, 1 టీస్పూన్ కలబంద జెల్, 1 టీస్పూన్ నిమ్మరసం మరియు 1 టీస్పూన్ విటమిన్ ఇ నూనె కలిపి రాసుకోండి. ఈ ప్యాక్ జుట్టును బలంగా మరియు ఆరోగ్యంగా చేస్తుంది. జుట్టు పెరుగుదలకు 1 కప్పు గ్రీన్ టీ, 1 కప్పు కలబంద జెల్ కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఈ ప్యాక్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది. మీ జుట్టుకు పోషణను అందిస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో భారీగా సంక్రాంతి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే
Telangana: తెలంగాణలో మళ్లీ పెరగనున్న చలి తీవ్రత
గ్రామాల్లో ఇసుక లారీల దూకుడు ఆగమవుతున్న పల్లె జనం
బస్సు డ్రైవర్‌గా మదురో ప్రస్తానం.. పుట్టపర్తి సాయిబాబాకు వీరభక్తుడు
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

