బస్సు డ్రైవర్‌గా మదురో ప్రస్తానం.. పుట్టపర్తి సాయిబాబాకు వీరభక్తుడు
అమెరికా అధ్యక్షుడి ప్రకటనతో నికొలస్ మదురో పేరు మారుమోగిపోతోంది. బస్ డ్రైవర్‌గా జీవితం ప్రారంభించి, వామపక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొని హ్యూగో చావెజ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఎదిగారు. చావెజ్ మరణానంతరం వెనిజులా అధ్యక్ష పగ్గాలు చేపట్టి, అనేక ఎన్నికలలో విజయం సాధించారు. పుట్టపర్తి సాయిబాబా భక్తుడైన మదురో ప్రస్థానం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
జనవరి మూడు… ప్రపంచ రాజకీయాల్లో ఒక షాకింగ్ డే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో లాటిన్ అమెరికాను కుదిపేశాడు. వెనిజులాపై ‘లార్జ్ స్కేల్ స్ట్రైక్’ చేశామని, ఆ దేశ అధ్యక్షుడు నికోలాస్ మదురోను పట్టుకున్నామని ప్రకటించాడు. డ్రగ్స్‌పై యుద్ధమంటూ మొదలైన కథ ఇప్పుడు నేరుగా ఒక దేశాధ్యక్షుడి అరెస్టు వరకూ వెళ్లింది. దీంతో నికోలస్ మదురో పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగి పోతోంది. మదురో చరిత్రను తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు. నికొలస్ మదురో.. దాదాపు పన్నెండేళ్లుగా వెనెజువెలా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ప్రముఖ వామపక్ష నేత, మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌కు అత్యంత సన్నిహితుడు. చావెజ్ మరణం తర్వాత అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. సామాన్య కార్మిక కుటుంబంలో జన్మించిన మదురో.. 90వ దశకంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. వెనెజువెలా రాజధాని కారకాస్‌లో 1962లో మదురో జన్మించారు. తండ్రి ఓ కార్మిక నాయకుడు. 1990ల్లో మదురో బస్ డ్రైవరుగా పనిచేశారు. అదే సమయంలో వామపక్ష రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తదనంతర కాలంలో హ్యూగో చావెజ్‌కు అత్యంత సన్నిహితుడయ్యారు. 1999లో చావెజ్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత మదురో దశ మారింది. ఆయనకు కీలక పదవులు లభించాయి. జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా, విదేశాంగమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. క్యాన్సర్‌తో 2013లో చావెజ్ మరణించడంతో దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా మదురో బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది జరిగిన ప్రత్యేక అధ్యక్ష ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించి.. పూర్తిస్థాయిలో అధ్యక్ష పగ్గాలు స్వీకరించారు. ఆ తర్వాత మరో రెండు ఎన్నికల్లో విజయం సాధించారు. మదురో.. పుట్టపర్తి సత్య సాయిబాబా భక్తుడు. ఆయన కార్యాలయంలో బాబా భారీ చిత్రపటం ఉంటుంది. 2005లో విదేశాంగమంత్రి హోదాలో భారత్ పర్యటనకు వచ్చిన ఆయన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. సాయిబాబాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
Hyderabad: గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
టీ20 ప్రపంచకప్‌లో ఊహించని మార్పులు.. భారత్‌లో ఆడలేమంటున్న బంగ్లాదేశ్
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

